శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జాడలేని నైరుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 13: అదిగో.. ఇదిగో అంటూ అందరినీ ఊరిస్తూ వచ్చిన నైరుతి రుతుపవనాల జాడ ఇంతవరకు లేదు. జూన్ నెల మొదటి వారంలోనే రాష్ట్రంలోకి అందులోనూ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని గతంలో వాతావరణ శాఖ సమాచారం ఇచ్చిన సంగతి విదితమే. జూన్ రెండవ వారం కూడా పూర్తయిపోయింది. కానీ ఇంతవరకూ రుతుపవనం జిల్లాలో వీయనేలేదు, తొలకరిని మరోసారి పరిచయం చేయనేలేదు. జూన్ మొదటివారంలో కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు, రెండ్రోజుల పాటు అక్కడ చెదురుమదురు వర్షాలు కురిపించాయి. అక్కడ్నుంచి పయనమై ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో ఒకటి రెండు చినుకులకు మాత్రమే పరిమితమయ్యాయి. రుతుపవన క్రమంలో ఏర్పడిన అవాంతరాల వల్లనే ఇంకా నెల్లూరు జిల్లాలోకి నైరుతి అడుగుపెట్టలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రోహిణికార్తె ముగిసేలోగా సాధారణంగా తొలకరి వానలు పడుతుంటాయి. కానీ రోహిణి ముగిసినా కూడా ఆ జాడే లేదు. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల రుతుపవనాల క్రమంలో ఒడిదుడుకులు ఏర్పడుతూ రుతువులు క్రమం తప్పుతున్నాయని వాతావరణ, పర్యావరణ శాస్తవ్రేత్తలు ఎప్పట్నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. గతంలోనూ నైరుతి రుతుపవనాలు జూన్ నెలాఖరు వరకూ కూడా జిల్లాలో ప్రవేశించిన సందర్భాలు ఉన్నాయి. ఎల్‌నినో కారణంగా వాతావరణంలో ఏర్పడ్డ అనూహ్య మార్పులతో ఇటువంటి పరిస్థితి తలెత్తుతోంది. మే నెలలో ఏర్పడ్డ అల్పపీడనం తుఫాన్‌గా మారింది. సాధారణంగా రుతుపవనాలకు మందు ఏర్పడే అల్పపీడనం వల్ల రుతువులు కాస్త ముందుగానే తమ రుతు ధర్మాన్ని పాటిస్తుంటాయి. మే నెలలో తుఫాన్ ఏర్పడ్డా కూడా నైరుతిలో వేగం మందగించింది. నైరుతి రుతుపవనాల వల్ల నెల్లూరు జిల్లాకు వర్ష ప్రభావం పెద్దగా ఉండదు. అయితే తొలకరి వానలు కురిసినందు వల్ల అప్పటిదాకా సెగలు కక్కుతున్న పగటి ఉష్ణోగ్రతలు చల్లబడడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా జిల్లాలోని డెల్టా ప్రాంతంలో ప్రారంభమైన రెండవ పంటకు నైరుతిలో కురిసే కొద్దిపాటి వర్షం పెద్ద మేలే చేస్తుంది. దీంతో అన్నదాత నైరుతి కోసం ఎదురుచూడడం పరిపాటి. ఇప్పటికే తన పని పూర్తిచేసుకుని వెళ్లాల్సిన తొలకరి ఇంకా జిల్లావైపు తొంగి చూడకపోవడంతో రైతులతో పాటు జిల్లావాసులు సైతం నైరుతి రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.