శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సిఎం పర్యటన వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, జూన్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన వాయిదా పడటంతో మరోసారి విపిఆర్, ఆయన అభిమానులకు నిరాశ ఎదురైంది. సేవా కార్యక్రమాలను విస్తృత పరచేందుకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతపరచే ఉద్దేశంతో టిడిపిలో చేరాలనుకుంటున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. ఇదే విషయాన్ని సిఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన గురువారం మాట్లాడుతూ సమాజ సేవకు జీవితం అంకితం చేయాలన్న సదుద్దేశంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నానన్నారు. సేవలను మరింత విస్తృతపరచేందకు పేదలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలను కల్పించేందుకు సిఎం చేతుల మీదుగా ప్రారంభాలకు వేదిక ఏర్పాటు చేసుకున్నారు. వాతావరణ వ్యతిరేక పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయింది. రహదారి మార్గాన ప్రయాణించేందుకు భద్రతా బలగాలు అంగీకరించకపోవటంతో ఆయన పర్యటన రద్దయింది. దీంతో విపిఆర్ సంకల్పించిన సేవా కార్యక్రమాలు, ఆయన పార్టీలో చేరిక మరోసారి వాయిదా పడ్డాయి. వాస్తవానికి గత నెలలోనే చేరిక జరగాల్సి ఉన్నా అప్పుడు చివరి క్షణంలో సిఎం పర్యటన వాయిదా పడింది. వైఎస్‌ఆర్‌సిపి సమన్వయకర్తగా వ్యవహరించిన విపిఆర్ ఆ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. సామాజిక సేవలను మరింత విస్తృత పరచేందుకు టిడిపిలో చేరాలని సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకే పార్టీలో చేరుతున్నట్లు ఆయన ఇదివరకే వెల్లడించారు.