శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరుటౌన్, జూన్ 24: భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో ముద్దాయికి శుక్రవారం 7వ అదనపు న్యాయమూర్తి గురప్ప జీవిత ఖైదు విధించారు. వివరాల మేరకు 2006 జూలే 7న పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన డేగా పిచ్చయ్య భార్య శైలపై అనుమానంతో కత్తితో దారుణంగా హత్యచేశాడు. అప్పట్లో పొదలకూరు పిఎస్‌లో ఫిర్యాదు చేయగా గురప్పను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈకేసు శుక్రవారం విచారణకు రాగా ముద్దాయిపై ఆరోపణలు రుజువు కావడంతో పిచ్చయ్యకు జీవిత ఖైదు, 1000 రూపాయల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరుపున పి శ్రీనివాసమూర్తి వాధించారు.