శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రతికూల పవనాలలో కూడా విజయం సాధించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, జూన్ 24: జిల్లాలో 1977లో జనతా పార్టీ తరపున ఉదయగిరిలో తాను గెలుపొందానని, 1983లో ఎన్‌టిఆర్ ప్రారంభించిన టిడిపి ప్రభంజనం ఉన్నప్పటికీ తాను తిరిగి అదే నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నిక అయ్యాయని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు వెల్లడించారు. వరుసగా నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికై తొలిసారిగా నెల్లూరు వచ్చిన వెంకయ్యనాయుడుకు ఘనస్వాగతం లభించింది. స్థానిక అయ్యప్పగుడి కూడలిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం స్వాగతం పలికారు. అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి నగరంలోని రామ్మూర్తినగర్‌లో ఉన్న బిజెపి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనను పార్టీ నాయకులు, గజమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించడంలో మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పార్టీ బలోపేతానికి మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని రాబోవు రోజుల్లో బిజెపి పతాకాన్ని రెండు రాష్ట్రాల్లో ఎగురవేయాలన్నారు. ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు గ్రామగ్రామాన మరుగుదొడ్ల నిర్మాణం, ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల సాకారం చేసే విధంగా 420 రూపాయలు బీమా పాలసీ చేస్తే ప్రమాదవశాత్తు అతనికి ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి రెండు లక్షలు వెంటనే బ్యాంకు ద్వారా అందుతుందన్నారు. అందుకోసం జన్‌ధన్ యోజన పథకం పేద మహిళలకి బ్యాంకు ఖాతాలను తెరిపించడం జరిగిందన్నారు. రైతులకు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లితే వారికి తక్షణ సాయం అందించేందుకు ఐదు లక్షల రూపాయలు పసల్ బీమా ఏర్పాటు చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇప్పటికే దుగరాజపట్నం, రామయ్యపట్నం పోర్టుకు నిధులను విడుదల చేశారన్నారు. అండర్ డ్రైనేజికి వంద కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశామని, ఆ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. రైతులకు విద్యుత్ ఆటంకం కలగకుండా 50 శాతం రాయితీతో సౌర విద్యుత్ మోటార్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని తాను దేవుడిగా భావిస్తున్నానన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పి సురేంద్రరెడ్డి, ఎస్‌ఎస్‌ఆర్ నాయుడు, ఎం ఈశ్వరయ్య, కె భాస్కర్, నరసింహులునాయుడు, వై రాజేష్, సిహెచ్ శ్రీనివాసులు, ఎం సురేష్, కె మధు, ఎం శ్రీనివాసులు గౌడ్, ఎం విజయలక్ష్మి, కోటేశ్వరమ్మ, పరశురాం, ఎం రాంకుమార్‌రెడ్డి, చక్రధర్, కె సుధాకర్‌రెడ్డి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.