శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సైకిలెక్కనున్న సునీల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఏప్రిల్ 5: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూడూరు శాసనసభ్యుడు పాశం సునీల్‌కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈమేరకు ఆయన మంగళవారం టిడిపి అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఆయనను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేకపోవడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను పార్టీ వీడుతున్నట్టు పార్టీశ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. ఇకపై పార్టీ బరువు బాధ్యతలు ఎల్లసిరి గోపాలరెడ్డి భుజస్కంధాలపై వేసుకుంటారని నర్మగర్భంగా చెప్పి వార్తల్లో నిలిచారు. అప్పటి నుండి ఎప్పుడు పార్టీ వీడుతారు అని విలేఖర్లు పదేపదే ప్రశ్నించినా అదేమీలేదని కొట్టిపారేస్తూ వచ్చారు. ఆయన ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఈ ప్రాంతానికి చెందిన పలువురు వైకాపా నాయకులతో జగన్మోహనరెడ్డి నివాసంలో కలిశారు. ఈనేపథ్యంలో ఇక పార్టీ వీడరని అందరూ ఊహించుకుంటున్న తరుణంలో మంగళవారం బాబూ జగ్జీవన్‌రాం జయంతి వేడుకలకు నెల్లూరు వెళ్లిన ఎమ్మెల్యే అటునుంచి అటే విజయవాడకు వెళ్లి జిల్లా మంత్రి నారాయణను కలసినట్టు తెలిసింది. ఈనేపథ్యంలో రాత్రి సిఎం చంద్రబాబును కలసి పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తన సన్నిహితులకు కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది. ఇదిలావుండగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో కొనసాగిన పాశం సునీల్‌కుమార్ తొలిసారిగా గూడూరు పురపాలక సంఘ చైర్మన్‌గా అతి పిన్నవయస్సులో ఎన్నికయ్యారు. చైర్మన్‌తో రాజకీయ రంగప్రవేశం చేసిన సునీల్‌కుమార్ రెండుసార్లు గూడూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు టికెట్ కోసం విశ్వప్రయత్నం చేసినా దక్కలేదు. ఒకసారి బల్లి దుర్గాప్రసాదరావుకు, మరోసారి మాజీ ఎంపి ఉక్కాల రాజేశ్వరమ్మకు టికెటు దక్కడంతో అప్పటి నుండి పార్టీలో తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. తెలుగుదేశంలో ఆయన రాజకీయంగా లబ్ధి పొందింది మున్సిపల్ చైర్మన్‌గానే. అనంతరం జరిగిన పరిణామాల్లో రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహనరెడ్డి పార్టీని స్థాపించడం, ఆ పార్టీలో చేరిన సునీల్‌కుమార్‌కు తొలిసారిగానే ఇక్కడి నాయకుల అండదండలతో పార్టీ టికెట్ సంపాదించుకొని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో రెండేళ్లు పార్టీలో అసంతృప్తిగా కొనసాగుతూ వస్తున్నారు. పలు దఫాలుగా ఆయన పార్టీ వీడుతున్నట్టు పుకార్లు షికార్లు చేసినా అవేమీ లేదంటూ కొట్టిపారేస్తూ వచ్చారు. మొత్తమీద ఎమ్మెల్యే సునీల్ పచ్చకండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.