శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆత్మగౌరవంతోనే స్వచ్ఛ్భారత్ సాధ్యం:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మగౌరవం కార్యక్రమంతోనే స్వచ్ఛ్భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ఆత్మగౌరవంలో భాగంగా ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకొని ఆత్మగౌరవంతో జీవించాలని జిల్లా కలెక్టర్ ఎం జానకి అన్నారు. ఆదివారం జిల్లాలోని ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి కృష్ణపట్నం పోర్టులోని ఓ హోటల్‌లో ఆత్మగౌరవంపై రెండో రోజు వర్క్‌షాపు జరిగింది. ఈ సందర్భంగా పోర్టు ఉన్నతాధికారులు కలెక్టర్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరు నాటికి ఆత్మగౌరవం కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునేలా అధికారులు చర్యలు తీసుకొని లక్ష్యాన్ని పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు 102 గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జనకు స్వస్తి చెప్పి మరుగుదొడ్లు నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఇంకా 832 గ్రామాలు మిగిలి ఉన్నాయని డిసెంబరు నెలాఖరు నాటికి లక్ష్యాన్ని పూర్తిచేస్తామని కలెక్టర్ తెలిపారు. మరుగుదొడ్డి నిర్మించుకొనే లబ్ధిదారులకు గ్రీన్ ఇండియా ఛానల్ ద్వారా బిల్లులు చెల్లింపులు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, మీడియా కూడా భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు. ఆత్మగౌరవంలో గల పలు సమస్యలను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆత్మగౌరవం సహాయ సహకారాలు అందించేందుకు కృష్ణపట్నం ఓడరేవుతోపాటు ఎపి థర్మల్ కేంద్రాలు, ఇతర పరిశ్రమలు మరుగుదొడ్ల నిర్మాణానికి కొంత నిధులు కేటాయించేందుకు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. అంతకుముందు ఎపిసిసిఐఎల్ సెక్యురిటీ సెర్వీసెస్ శిక్షణా కేంద్రం ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు సుమారు 200 మంది ఒకేసారి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదం పలికారు. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు నిర్వాసిత గ్రామాలు, శిక్షణా కేంద్రం, వైద్యశాల, మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించి ఓడరేవు ప్రగతిపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోర్టు ఉన్నతాధికారులు, మీడియా మేనేజర్ శ్రీనివాసులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.