శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిల్లకూరు, జూలై 31: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం మండలంలోని వరగలి, వల్లిపేడు గ్రామాల్లో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వైద్యుల కొరత అధికంగా ఉండటంతో 1400 మంది వైద్యుల పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా మరో 500 పోస్టుల అవసరమని, వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాకు 30 పడకల ఆసుపత్రులను ఐదింటిని మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందులో ఉదయగిరి, కోవూరు, రాపూరు, వింజమూరు, వెంకటాచలం ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తామన్నారు. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నూతన ఆరోగ్య కేంద్రాలు అవసరమని సంబంధిత ఎమ్మెల్యేల నుండి విజ్ఞాపనలు వచ్చాయని, త్వరలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకొంటామన్నారు. ఆగస్టు 15 నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు 700 రూపాయల విలువ చేసే బేబీ కిడ్ బ్యాగును అందిస్తామన్నారు. రాష్ట్రంలో 275 ఎన్‌టిఆర్ సంచార వాహనాలను గ్రామాల్లో తిప్పి గ్రామీణులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామన్నారు. పిఎహెచ్‌సిలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లోని ప్రజలు ఈ సౌకర్యాలను పొందవచ్చునన్నారు. గత ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు పెద్ద పీట వేశాయన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువగా వైద్య ఆరోగ్య శాఖకు నిధులు కేటాయించి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. ప్రజలకు సేవ చేయడం దేవుడిచ్చిన వరమని, పాలన సాగించిన కొంతకాలమైన మంచిపేరు తెచ్చుకోవాలన్నదే తన అభిమతమన్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా ట్యాబ్‌లను ఎఎన్‌ఎంలకు ఇచ్చి తద్వారా ఆసుపత్రుల్లో ప్రసవం వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకొంటున్నామన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు సమయ పాలన పాటించేందుకు బయో మెట్రిక్ విధాన్ని ప్రవేశ పెట్టినట్లు పేర్కొన్నారు. నూతనంగా తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణులకు ఆసుపత్రుల్లో ప్రసవం జరిగే విధంగా చూసి ప్రసవ అనంతరం ఇళ్లకు చేర్చడం జరుగుతుందన్నారు. ప్రసవం అయిన వారికి వెయ్యి రూపాయలు, పట్టణాల్లో ఉన్న వారికి 750 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో పిహెచ్‌సిల పరిధిలో19 వైద్య పరీక్షలు, ప్రాంతీయ వైద్యశాలల్లో 66 వైద్య పరీక్షలు పేదలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. సబ్ సెంటర్ పరిధిలో 42 పరీక్షలను అందిస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌రే ప్లాంట్లు, బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు. నియోజక వర్గం చాలా వెనుకబడి ఉందని, దానికి తోడు ఎస్సీ నియోజకవర్గమైనందున వైద్యపరంగా అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఉన్న చిట్టేడు, వల్లిపేడు, ఈశ్వరవాక, నిడిగుర్తి, కోట, చిట్టమూరు, పిహెచ్‌సిలకు ప్రహరీ గోడలు ఏర్పాటు చేయాలన్నారు. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరులలో సబ్ సెంటర్ల ఏర్పాటుకు నూతన భవనాలను నిర్మించాలన్నారు. ఎంపి వరప్రసాద్ మాట్లాడుతూ ఎంపి నిధుల నుండి 60 లక్షల విలువ చేసే సోలార్ వాటర్ సిస్టంను ఏర్పాటుచేసినట్టయితే ఆసుపత్రుల్లో ప్రసవమైన వారు స్నానాలు చేసేందుకు వీలుగా ఉంటుందని మంత్రి కోరగా ఎంపి దానికి అంగీకరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ వరసుందరం, టిడిపి నాయకులు యరటపల్లి జానకిరామిరెడ్డి, చిల్లకూరు పట్ట్భారెడ్డి, వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి, పి ప్రవీణ్‌రెడ్డి, యనమల ప్రభాకర్, రమేష్‌బాబు, బి విష్ణువర్ధన్ రెడ్డి,యద్దల మదుసూధన రెడ్డి, ఉచ్చూరు వెంకటేశర్లురెడ్డి, ఎంపిపి వీరుబోయిన రమాదేవి, జడ్పిటిసి ఓడూరు యమునమ్మ, పారిచెర్ల రామచంద్రయ్య, మూగా శంకరయ్య, వెంకటకృష్ణయ్యలతో పాటు మండల శాఖ అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.