శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాజీవ్‌గాంధీ స్మారక సద్భావనా యాత్రకు ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఆగస్టు 9: రాజీవ్‌గాంధీ స్మారక సద్భావనా యాత్రకు గూడూరులో డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. గూడూరు రూరల్ పరిధిలోని చిల్లకూరు బైపాస్‌కు ఈ యాత్ర మంగళవారం చేరుకొంది. తమిళనాడులోని శ్రీపెరంబదూరు నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు సాగుతున్న రాజీవ్‌గాంధీ స్మారక సద్భావనా యాత్ర మంగళవారం జాతీయ రహదారి మీదుగా గూడూరుకు చేరుకొంది. ఈ యాత్రకు స్వాగతం పలికిన డిసిసి అధ్యక్షులు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం ఇందిరమ్మ కుటుంబం ప్రాణత్యాగాలకు కూడా వెనకాడకుండా సేవలు అందించిందన్నారు. దేశంలో సాంకేతిక పురోభివృద్ధికి దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎనలేని కృషి చేశారని అన్నారు. దేశం కోసం తుదిశ్వాస విడిచే వరకు ఇందిరమ్మ బాటలో రాజీవ్‌గాంధీ అందించిన సేవలు చిరస్మరణనీయమన్నారు. అటువంటి గొప్పనేత తీవ్రవాదుల చేతిలో హత్యగావించబడటం, దేశానికి తీరని లోటని అన్నారు. అనంతర్ రాజీవ్ జ్యోతికి కాంగ్రెస్ జెండాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజీవ్ అమర్ రహే అని కార్యకర్తల నినాదాలతో మారుమోగింది. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షులు వీరుబోయిన గోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి కె మునిగిరీష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దువ్వూరు రవీంద్రారెడ్డి, ఎన్‌డిసిబి డైరెక్టర్ గిద్దలూరు ముత్యాలయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి సవరపు కిషోర్‌కుమార్, జిల్లా బిసి సెల్ సెక్రటరీ జమల్ల శ్రీనివాసులు, పుట్టయ్య గౌడ్, తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు, దగ్గోలు సురేంద్ర, ఉడతా శరత్ యాదవ్, కార్తీక్, జనార్ధన్, రత్నయ్య, శ్రీనివాసులు, అన్వర్ బాష, బ్రహ్మయ్య, జహంగీర్, కల్లూరు రవి, పంటా శ్రీనివాసులరెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.