శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, ఆగస్టు 16: మైనారిటీ వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ మైనారిటీ అనుబంధ సంఘాలైన బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, మత్స్య, క్రిస్టియన్, చేనేత విభాగాల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఈ వర్గాల అభివృద్ధి కోసం పెద్దఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. గత పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ పదేళ్లకు 680 కోట్లు వినియోగిస్తే తమ ప్రభుత్వం కేవలం రెండేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1450 కోట్ల నిధులు ఖర్చు చేసిందన్నారు. గత పాలకులు కోట్లాది రూపాయల ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లిస్తే నేటి ప్రభుత్వం వారికి కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులన్నింటిని వారి సంక్షేమం కోసమే వినియోగించామన్నారు. ఎస్‌సి విద్యార్థుకు విదేశీ విద్యకోసం అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధిని ప్రవేశపెట్టటంతో పాటు చంద్రన్న చేయూత కార్యక్రమం ద్వారా 10వేల మంది నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించామన్నారు. మరోవైపు బిసిలకు ఉప ప్రణాళిక నిధులు ఏర్పాటుచేసి రెండేళ్లలో 14,500 కోట్లు వెచ్చించామన్నారు. వారి సంక్షేమం కోసం ఎన్‌టిఆర్ విదేశీ విద్య బోధన పథకం, ఉపకారవేతనాలు, బిసి సమాఖ్యలకు పాలకవర్గాల నియామకాలు చేపట్టి నిధులు కేటాయించామన్నారు. కాగా 111 కోట్ల రూపాయల చేనేత రుణాలను మాఫీ చేశామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి రాష్ట్ర జనాభాలో 70 శాతం ఉన్న ఈ వర్గాల సంక్షేమానికి అధికంగా నిధులు వినియోగించామన్నారు. అనుబంధ సంఘాలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, అన్ని విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.