శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది:ఎజెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, ఆగస్టు 18 : ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యం సరిగా లేకపోతే జీవనం కష్టతరమవుతుందని ఇందుకోసమే మన తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉన్నాయా, లేదా అని పరీక్షించి తీసుకోవడం మంచిదని జిల్లా జాయింట్ కలెక్టర్-2 సాల్మన్ రాజ్‌కుమార్ అన్నారు. గురువారం పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కృష్ణా పుష్కరాల చర్చలో భాగంగా మంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం, మంచి అలవాట్లు, సమతుల ఆహారం తీసుకోవడం, జీవనశైలిని మార్చుకోవటం తదితర అంశాలపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవన క్రమంలో ఆహారపు అలవాట్లు వచ్చాయన్నారు. ఆదిమకాలంలో మానవులు పూర్తిగా మాంసహారులని, 14, 15వ శతాబ్దాల కాలంలో వివిధ రకాల శాఖాహార రకాల విత్తనాలు మనదేశానికి వచ్చాయని, వాటిని పూర్తిగా పరీక్షించి పోషక విలువలు తెలుసుకుని వాడటం జరిగిందన్నారు. ఆహారం వివిధ దేశాల వాతావరణాన్నిబట్టి తీసుకోవడం జరుగుతుందన్నారు. మనదేశంలో ప్రధానంగా వరి, రోటి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, న్యూట్రీషన్ విలువలు కలిగిన పానీయాలు తీసుకునేవారన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయినా మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించ లేదన్నారు. దానికి ప్రధాన కారణం జనాభా అధికం కావడం తదనుగుణంగా ఉత్పత్తి తక్కువ ఉండటం ప్రధాన కారణమన్నారు. 30 ఏళ్ల క్రితం మనదేశంలో భిక్షగాళ్లు ఎక్కువగా ఉండేవారని, ఈరోజుల్లో ఎవరూ లేరని, ఉన్నా అన్నం ఎవరూ అడగటం లేదన్నారు. పూర్వం అన్నం ధనికులు మాత్రమే తినేవాళ్లని, 70 ఏళ్ల తరువాత ఆహార భద్రత దొరికిందన్నారు. నెల్లూరు జిల్లాలో గత సంవత్సరం అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చిన వర్షాల వల్ల నష్టం జరిగినా వ్యవసాయంలో అత్యధిక దిగుబడి సాధించగలిగామన్నారు. మత్స్య, పశుసంవర్థక, ఉద్యానవన శాఖల ద్వారా 11.9 శాతం డబుల్ డిజిట్ గ్రోత్ జరిగిందన్నారు. పూర్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్పని ఒక్కొక్క కుటుంబం 10 మంది పిల్లల్ని కంటే 4 మంది చనిపోయి మిగిలినవారు బతికేవారన్నారు. ఈనాటి సమాజంలో ఎంత తక్కువ పిల్లలుంటే అంత గౌరవం అన్నారు. ఆరోగ్యశాఖ ద్వారా తల్లి, బిడ్డల మరణాలు రేటు తగ్గిందన్నారు. పిల్లలకు పౌష్టికాహారం, సకాలంలో టీకాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. తల్లీబిడ్డ ఎవరు మరణించినా జిల్లా కలెక్టర్ స్థాయిలో సమీక్ష జరిపించి కారణాలు వెతుకుతూ పునరావృతం కాకుండా చూస్తున్నారన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వరసుందరం మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలని, మంచి ఆలవాట్లను కల్గి ఉండాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, శరీరానికి అవసరమైన వ్యాయామాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిసిడిఎస్ పిడి విద్యావతి, పిఓడిటి డాక్టర్ రమాదేవి, డిఎస్‌డిఓ విజయకుమార్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పెన్నమ్మకు పంచనక్షత్ర హారతులు
వేదాయపాళెం, ఆగస్టు 18 : శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలోని పెన్నానదిలో గంగమ్మ తల్లికి గురువారం సాయంత్రం స్థానిక ప్రజలు సంధ్యా హారతులను రంగనాథస్వామి ఆలయంలో అందచేశారు. పంచనక్షత్ర హారతులను గంగమ్మకు ఇస్తున్న సమయంలో భక్తుల నీరాజనాలతో ఆ ప్రాంతమంతటా పుష్కరశోభ సంతరించకుంది. ఆలయ చైర్మన్ మంచికంటి సుధాకర్, ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు పిండాబి జగన్నాధచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఇద్దరు మృతి
9 మందికి గాయాలు
నాయుడుపేట, ఆగస్టు 18: మండల పరిధిలోని జాతీయ రహదారిపై నరసారెడ్డికండ్రిగ క్రాస్‌రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో బస్సు కండక్టర్ కె మునీంద్ర (38), ప్రయాణికుడు వి సుధాకర్ (40) మృతి చెందారు. ప్రయాణికుల్లో 9 మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాద వివరాలిలా ఉన్నాయి. గూడూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరు నుండి నాయుడుపేట మీదుగా తిరుపతికి బయలుదేరింది. బస్సు జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా డ్రైవర్ శ్రీ్ధర్ నిద్రలోకి జారుకున్నాడు. అదే సమయానికి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన లారీ మరమ్మతులకు గురై నరసారెడ్డి కండ్రిగ వద్ద ఆగి పోయింది. నిద్ర మత్తులో ఉన్న బస్సు డ్రైవర్ ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బస్సు ఎడమవైపు కూర్చున్న కండక్టర్ ఘటన స్థలంలో మృతి చెందగా, కండక్టర్ వెనుక కూర్చున్న ప్రయాణికుడు సుధాకర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోమృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన 9 మందికి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించారు. ఎస్సై పివి నారాయణ మృతదేహాలను పంచనామాకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరగడంతో డ్రైవర్ శ్రీ్ధర్ పరారై గురువారం పోలీసులకు లొంగిపోయాడు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన కండక్టర్ మునీంద్రది గూడూరు మండలం చెన్నూరు గ్రామం. ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుడు సుధాకర్ ఒంగోలు పట్టణానికి చెందినవాడని తెలిసింది.

ట్రాఫిక్ చక్రబంధంలో గూడూరు
గూడూరు, ఆగస్టు 18: గూడూరు పట్టణంలో వాహనాల సంఖ్య పెరిగినంతగా రహదారుల విస్తీర్ణం చేపట్టకపోవడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనచోదకులు అల్లాడిపోతున్నారు. గురువారం సంగం సినిమా హాలు నుండి సాయిబాబా ఆలయం వరకు గల రహదారిలో రెండు గంటలపాటు వాహనాలు ఎటూ వెళ్లలేక వాహనచోదకుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఈ మార్గంలో మూడు కల్యాణ మండపాలు, సాయిబాబా ఆలయంతో పాటు ఎల్లైసీ కార్యాలయం, ఆక్వాకు చెందిన కార్యాలయాలు, వాహనాల షోరూంలు ఉన్నాయి. వీటికితోడు గురువారం అధిక సంఖ్యలో పెళ్లిళ్లు ఉండటం, ఎక్కడా వాహనాలకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రోడ్డుమీదే వాహనాలను పార్కింగ్ చేసి వెళ్లడం, పట్టణంలోకి దూరప్రాంతాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఆటోలతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. అంతేకాకుండా గురువారం, శ్రావణపౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇదే మార్గంలో ఉన్న బాబా ఆలయానికి రావడంతో తమ తమ వాహనాలను రోడ్డుమీదే పార్కింగ్ చేయడంతో దాదాపు ఈ మార్గంలో వాహనాలు రెండు గంటలపాటు స్తంభించిపోయాయి. పోలీసులు స్పందించి ఈ మార్గంలో వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఘనంగా చండీయాగం
సూళ్లూరుపేట, ఆగస్టు 18: తెలుగు, తమిళ భక్తుల ఆరాధ్య దైవమైన చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పౌర్ణమి పర్వదినం సందర్భంగా గురువారం మహా చండీయాగం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాల మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటుచేసి వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ యాగం వైభవంగా జరిగింది. చెన్నైకి చెందిన కడివేటి గోపాలకృష్ణారెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. వీరికి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అరవభూమి చంద్రశేఖర్‌రెడ్డి, ఇవో శ్రీనివాసులరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి యాగం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

ఎర్రచందనం దొంగల అరెస్ట్
మర్రిపాడు, ఆగస్టు 18: మర్రిపాడు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి నిందితులైన ఏడుగురుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆత్మకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ ఖాజావలి తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎర్రచందనం దుంగల దొంగల వివరాలను ఆయన వెల్లడించారు. ఆత్మకూరు పట్టణం టెక్కేవీధికి చెందిన షేక్ షాజుద్దీన్, మహ్మద్ ఆలిజిన్నా, ఎసిఎస్‌ఆర్ కాలనీకి చెందిన సయ్యద్ సర్దార్ అహ్మద్, నారాయణరావుపేటకు చెందిన మస్తాన్‌బాషాలతోపాటు మర్రిపాడు మండలం పడమటినాయుడుపల్లికి చెందిన షేక్ సద్దాం, షబ్బీర్, గ్రంధె రామయ్యలు ఉన్నట్లు వివరించారు. నిందితుల నుంచి 20 వేల రూపాయలను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. వీరంతా ఎర్రచందనం దుంగలను అక్రమంగా నరకడానికి, రవాణా చేయడానికి సమావేశమై ఉండగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా, నిందితులను ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కోనసముద్రంపేట బస్‌స్టాప్ వద్ద అరెస్ట్ చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు.