శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నగరంలో 10 రైతు బజార్లు ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 23: నెల్లూరు నగరంలో కనీసం 10 రైతుబజార్లను ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో ప్రాథమిక రంగాల్లో రెండంకెల అభివృద్ధి సాధించడంపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పజలకు ఎక్కువ రైతు బజార్లు అందుబాటులో ఉంటే వారికి సమయం కలిసి వస్తుందన్నారు. ఈ విషయంపై కార్పొరేషన్ అధికారులతో చర్చించి నగరంలో అదనంగా రైతుబజార్లను ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతూ రెండంకెల వృద్ధిని సాధించాలంటే ప్రస్తుతం సాగులో ఉన్న భూమిలో అధిక ఉత్పత్తి చేయడంతోపాటు కొత్తగా భూమిని వ్యవసాయంలోకి తీసుకురావాల్సి వస్తుందన్నారు. జిల్లాలో ఉన్న పశువులకు ఎంత మేత అవసరం, ఎన్ని చనిపోతున్నాయి, కొత్తగా ఎన్ని పశువుల్ని రైతులు కొంటున్నారనే విషయాన్ని శాస్ర్తియంగా అధ్యయనం చేయాలని పశుసంవర్దక శాఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా కోళ్ల పరిశ్రమ గురించి కూడా నివేదికలు తయారు చేయాలన్నారు. ఉద్యనవన పంటలు వేసే విధంగా రైతుల్ని ప్రోత్సహించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. మత్స్యశాఖపై జరిగిన సమీక్షలో ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ సీతారామరాజు మాట్లాడుతూ పులికాట్ సరస్సుకు జిల్లా వైపు సముద్ర ముఖద్వారం ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరుతున్న సంగతిని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, దీనిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ -2 రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.