శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సమస్యలు పరిష్కరించండి.. కర్మాగారం నిర్మించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, సెప్టెంబర్ 27: కర్మాగారాల ఏర్పాటుకు ముందు అన్ని కంపెనీలు అవి చేస్తాం.. ఇవి చేస్తాం అంటూ హామీలు కురిపిస్తాయని.. చివరకు ఏమీ చేయవని కర్మాగారం ఏర్పాటు చేసిన తరువాత ప్రజావసరాలు, పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఉద్యోగాలు విస్మరిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు వద్ద నుంచి ఉన్న చిన్న కర్మాగారాల వరకు అన్నింటి పరిస్థితి అలాగే ఉంది. ప్రతిసారి మోసపోతున్నాం. ఈసారి మాత్రం రాతపూర్వకంగా హామీ ఇస్తేనే క్రిభ్‌కో ఎరువుల పరిశ్రమ ఏర్పాటుకు సమ్మతిస్తాం అంటూ ప్రజాప్రతినిధులు, నాయకులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. క్రిభ్‌కో భూసేకరణలో భారీ అవకతవకలు జరిగాయని, ఆర్హులకు కాకుండా బినామీలకు పరిహారం చెల్లించారని, అర్హులకు పరిహారం అందజేయాలన్నారు. సర్వేపల్లి సమీపంలో క్రిభ్‌కో ఎరువుల పరిశ్రమ ఏర్పాటుపై మంగళవారం ముత్యాలగుంట వద్ద జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధ్యక్షతన పర్యావరణ పరిరక్షణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మొదట కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ మొత్తం 286 ఎకరాల్లో 1517 కోట్లతో 12 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువుల తయారీకి కర్మాగారం నిర్మిస్తున్నామన్నారు. కంపెనీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్య, వైద్యం, ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంపకం చేపడతామన్నారు. సమీప గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రైతుల భాగస్వామ్యంతో వారి కోసమే ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు మాట్లాడుతూ అధికారులు రైతుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని వాపోయారు. నిబంధనలను పక్కనపెట్టి, చెరువులను కూడా అప్పగించారన్నారు. కాకర్లగుంట చెరువు పరివాహక ప్రాంతాన్ని క్రిభ్‌కో పరిశ్రమకు అప్పగించారని, దీంతో చెరువు ఆయకట్టుకు నీరందదని, చెరువుకు సంబంధించిన ప్రాంతాన్ని వదిలివేయాలన్నారు. లేకుంటే పోరాటాలకు దిగుతామన్నారు. పరిశ్రమ నిర్వాహకులు కంపెనీ ఏర్పాటుకు ముందు ఒక మాట, ఏర్పాటయిన తరువాత మరొక మాట చెబుతున్నారన్నారు. ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలను పూర్తిగా ఆమలుచేయటం లేదన్నారు. చెప్పిన వాటిని చేస్తే ప్రజలు కూడా సహకరిస్తారన్నారు. గ్రీన్‌బెల్ట్ ఏర్పాటుతోపాటు స్థానికులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసి తరువాత కర్మాగారం ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించకుండా కర్మాగారం ఏర్పాటుచేస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. పొలాలు పోయిన వారికి, స్థానికులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కాలుష్యం పెరిగితే సమీప గ్రామాల వారిని మరొకచోటకు తరలించి వారికి పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ పరిహారం అర్హులకు అందలేదన్న విషయంపై వెంటనే విచారణ జరపాలని ఆర్డీవోను ఆదేశించారు. బాధితులతో మాట్లాడి నివేదిక ఇవ్వాలని సూచించారు. కాకర్లగుంట చెరువు స్థలంపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సంయుక్తంగా విచారణ జరిపి చెరువు స్థలానికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. 15 రోజుల్లో నివేదిక తెప్పించి చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి అవకాశాలు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు, కాలుష్య నియంత్రణకు చర్యలు తదితర అంశాలు పూర్తిస్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈకార్యక్రమంలో నెల్లూరు ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లు, రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య కార్యదర్శి కోటిరెడ్డి, వెంకటాచలం జడ్పీటిసి సభ్యులు మందల వెంకటశేషయ్య, తహశీల్దార్ సుధాకర్, పలుశాఖల అధికారులు, క్రిభ్‌కో సంస్థ ప్రతినిధులు, రైతులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.