కర్నూల్

ఆలయాల దొంగల ముఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 1:జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన 10 మంది దొంగలను అరెస్టు చేసి వారి నుంచి బంగారు, వెండి, ఇత్తడి ఆభరణాలు, పూజా సామగ్రితో పాటు రూ. 31 వేల నగదు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఇందుకు సంబంధించి శనివారం ఎస్పీ నగరంలోని కెఎస్ వ్యాస్ ఆడిటోరియంలో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అరెస్టు చేసిన దొంగల్లో పూజారి మనోహర్, సాకి వెంకటనారాయణ, సరమేకల గణమద్దిలేటి, దాసరి నాగరాజు, వెంకటగిరి అశోక్, టేల్లకుల మధుసుధాకర్, జకాటి శైలజ, కాటిపోగు జయపాలు, కుందనం శ్రీకాంత్‌రెడ్డి, వీరశెట్టి వెంకటేశ్వర్లు ఉన్నారని, వీరు బేతంచర్ల, గిద్దలూరు, బనగానపల్లె, అర్ధవీడు, గుడివా డ, గడివేముల, బండిఆత్మకూరుకు చెందిన వారిగా గుర్తించామన్నారు. వీరు నంద్యాలకు చెందిన మరికొందరితో కలిసి నంద్యాలలో స్థావరాలు ఏర్పరచుకుని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతుండగా నంద్యాల పోలీసులు అరెస్టు చేశారన్నారు. నంద్యాలకు చెందిన పూజారి మనోహర్ ఆధ్వర్యంలో రాత్రివేళ ఆటోల్లో తిరుగుతూ నంద్యాల, సంజామల, ఆళ్లగడ్డ, వెల్తురి, బనగానపల్లె, శిరివెళ్ల, చాగలమర్రి, కోవెలకుంట్ల, గోస్పాడు, డోన్ తదితర ప్రాంతాల్లోని దేవాలయాల్లో హుండీలు, బంగారం, వెండి, ఇత్తడి ఆభరణాలు, పూజా సామగ్రి ఎత్తుకెళ్లారన్నారు. వీరు దొంగలించిన వాటి విలువ దాదాపు రూ. 1.7 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఇక ఆలయాల్లో భద్రతా లోపం లేకుండా ఆలయ కమిటీ సమన్వయంతో పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరాల ఏర్పాటుకు డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు చర్యలు తీసుకోవడంతో పాటు గస్తీ పెంచి నేరాలను నియంత్రించాలని ఎస్పీ ఆదేశించారు. దొంగలను అరెస్టు చేసిన నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, 3వ పట్టణ ఎస్‌ఐలు సూర్యవౌళి, హనుమంతరెడ్డి, హెచ్‌సి గంగాధర్, పిసి కృష్ణను అభినందించారు. సమావేశంలో నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి పాల్గొన్నారు.
ప్రొటోకాల్ విస్మరించిన
వ్యవసాయశాఖ అధికారులు
* ఎమ్మెల్యే గౌరు చరిత ఆగ్రహం..
* సర్దిచెప్పిన మాజీ మంత్రి ఏరాసు
ఓర్వకల్లు, అక్టోబర్ 1:ఓర్వకల్లులో శనివారం మండల వ్యవసాయ అధికారిణి మధుమతి ఆధ్వర్యంలో ప్రారంభమైన సబ్సిడీ విత్తన శెనగ పంపిణీ కార్యక్రమంలో ఆ శాఖ అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఏరాసు ప్రతాపరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనికి తోడు వేదికపైకి వ్యవసాయ అధికారి వరుసగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గోవిందరెడ్డితో సహా టిడిపి నేతలను ఆహ్వానించారు. కానీ ఎంపిపి, వైకాపా నాయకురాలు వెంకటరమణమ్మ, స్థానిక సర్పంచ్ పెద్దయ్య, స్థానిక వైకాపా ఎంపిటిసి అక్బర్‌ఖాన్‌లను ఆహ్వానించలేదు. దీంతో ఎమ్మెల్యే గౌరుచరిత అసహనం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం అధికార పార్టీ సమావేశం కాదని రైతులకు సంబంధించిన విషయం అని అధికారులు గుర్తించాలన్నారు. స్థానిక నేతలను వేదిక వద్దకు ఆహ్వానించక పోవడం ఏంటని ప్రశ్నించారు. ఇంతలో మాజీ మంత్రి ఏరాసు కలుగజేసుకుని ఎమ్మెల్యేకు సర్దిచెప్పారు. అదే సమయానికి వ్యవసాయశాఖ జెడిఎ ఉమామహేశ్వరమ్మ, ఏడిఎ వీరారెడ్డి అక్కడికి వచ్చి ప్రొటోకాల్ పాటించాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా బయోమెట్రిక్ విధానం వల్ల విత్తన శెనగ పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైందని పలువురు రైతులు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు త్వరగా విత్తన పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షుడు లక్ష్మికాంతరెడ్డి, వైకాపా నాయకులు నాగేశ్వరరెడ్డి, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.2