శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వీధి కుక్కలను నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, అక్టోబర్ 3: వీధి కుక్కలకు సంతానోత్పత్తి నిరోధక ఆపరేషన్లు చేసి వాటి సంఖ్యను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మునిసిపిల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణాలలో వీధి కుక్కల సంఖ్య తగ్గించాలంటే వెంటనే వాటికి సంతానోత్పత్తి నిరోధక ఆపరేషన్లు చేయాలన్నారు. ఈ విషయంపై ఇప్పటికే చాలాసార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ గురించి మంత్రి మాట్లాడుతూ దోమలను అరికట్టడంతో పాటు పారిశుద్ధ్యం గురించి ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకంపై మాట్లాడుతూ పని దినాల లక్ష్యాలను సాధించాలన్నారు. వర్మింకంపోస్టు, ప్లాంటేషన్ విషయంపై జరుగుచున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ముందుగా మంత్రి కొత్తూరు సమీపాన ఉన్న కాలనీ గృహాలను పరిశీలించారు. అక్కడ లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? ఇంకెన్ని గృహాలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఉన్న తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ ద్వారా పేదలకు అన్ని సౌకర్యాలతో అపార్టుమెంట్లు నిర్మించే కార్యక్రమాల గురించి మంత్రి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నెల్లూరు ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సర్వేపల్లిలో ఆన్‌లైన్ మోసం
* ఖాతాల్లో రూ.50 వేలు మాయం చేసిన వైనం
వెంకటాచలం, అక్టోబర్ 3 : మండలంలోని సర్వేపల్లి సిండికేట్ బ్యాంకు పరిధిలో అన్‌లైన్ మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి బ్యాంకు ఖాతాలో రూ.50 వేలు మాయమైన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. సర్వేపల్లి గ్రామానికి చెందిన పువ్వాడ వెంకటలీలమ్మకు స్థానికంగా ఉన్న సిండికేట్ బ్యాంకులో ఖాతా ఉంది. ఆ ఖాతాలో రూ.50 వేలు నగదు ఉంది. ఈ ఖాతా నుంచి ఇంటర్నెట్, మొబైల్ సేవలు ఏర్పాటు చేయాలని ఆమె బ్యాంకు అధికారులకు దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తులో ఆమె కుమారుడు నాగేశ్వరరావు ఫోన్ నెంబర్ ఇచ్చారు. కాగా ఆదివారం సాయంత్రం 7013184583 నెంబర్ నుంచి ఫోన్ చేసి తాము బ్యాంకు అధికారినని, మీరు ఆన్‌లైన్ సేవల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఈ సేవలు కొనసాగించేందుకు అనుమతిస్తున్నామని చెప్పారు. అనంతరం ఖాతానెంబర్, పిన్ నెంబర్‌తోపాటు పూర్తి వివరాలు అడిగ్గా నాగేశ్వరరావు పూర్తి వివరాలు వెల్లడించారు. వివరాలు తెలుసుకున్న కొద్దిసేపటికే మూడువిడతల్లో రూ.24 వేలు, సోమవారం వేకువఝామున ఐదు విడతల్లో రూ.26 వేలు నగదు డ్రా చేశారు. ఖాతాలో ఉన్న నగదు మొత్తం రూ.50 వేలు డ్రా చేశారు. ఆదివారం సాయంత్రమే నాగేశ్వరరావు నగదు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. వెంటనే నాగేశ్వరరావు ఫోన్ చేసి అడగ్గా మొదట అలానే వస్తుందని, సోమవారం తిరిగి ఖాతాలో జమ అవుతాయని చెప్పాడు. వరుసగా నగదు డ్రా చేస్తున్నట్లు మెసేజ్‌లు రాగా తిరిగి ఫోన్ చేస్తే ఎత్తకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. సోమవారం ఉదయం నాగేశ్వరరావు తల్లిని వెంటబెట్టుకొని బ్యాంక్‌కు వెళ్లాడు. ఈ మేరకు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయగా వారు బ్యాంకు ఖాతాను పరిశీలించి ఖాతాలో మొత్తం నగదు డ్రా అయినట్లు వివరాలు అందజేశారు. కష్టపడి సంపాదించి కూడపెట్టిన నగదు బ్యాంకు అధికారుల పేరుతో కొల్లగొట్టడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌నెంబర్ ఆధారంగా విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.