శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మహిళ హత్య కేసులో ప్రియుడికి జీవితఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరులీగల్, అక్టోబర్ 21: ఒక మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చిన స్పర్థల కారణంగా ఆమెను అతి దారుణంగా హత్య చేశాడని నమోదైన కేసులో నిందితుడు వి పెంచులయ్యపై ఆరోపణలు సాక్ష్యాధారాలతో రుజువైనందున అతనికి యావజ్జీవకారాగార శిక్షతోపాటు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ నెల్లూరు నాల్గవ అదనపు జిల్లాసెషన్స్ జడ్జి శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన నిందితుడు పెంచులయ్య ఆటో నడుపుకుని జీవించేవాడు. కలువాయి - రాపూరు నడుమ ఆటోలో కూలీలను తీసుకుని వదిలి వస్తుండేవాడు. కాగా హతురాలు బద్దల నాగలక్ష్మి కడపజిల్లా నడిపల్లి గ్రామవాసి. ఈమెకు వివాహమై ఒక బాబు ఉన్నాడు. ఈమె భర్త కువైట్‌కు వెళ్లిన కారణంగా రాపూరులోని తన తాతవద్ద ఉంటూ ఉండేది. నిందితుడు పెంచులయ్యకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు నడుపుతున్న ఆటోలో పరిచయమైన నాగలక్ష్మి మెల్లమెల్లగా పెంచులయ్యకు దగ్గరై వారి నడుమ వివాహేతర సంబంధం నెలకొంది. ఈ విషయం తెలిసిన నాగలక్ష్మి తాత ఆమెను నడిపల్లిలో వదిలివచ్చాడు. ఈ విషయం తెలిసిన నిందితుడు పెంచులయ్య నడిపల్లికి వెళ్లి ఆమెను తీసుకుని నెల్లూరు రెండవ పట్టణ పోలీసు పరిధిలోని మైపాడు గేటు నక్కల గుంటవద్ద ప్రత్యేకంగా కాపురం పెట్టాడు. వీరి వివాహేతర సంబంధం కొంతకాలం కొనసాగింది. తరువాత వీరి నడుమ గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2015 ఏప్రిల్ 5న రాత్రి ఇరువురి నడుమ పెద్దగొడవ జరుగగా ఇరుగు పొరుగు వారు సర్దిచెప్పారు. మరలా 2015 ఏప్రిల్ 6న అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిందితుడు పెంచులయ్యకు హతురాలు నాగలక్ష్మి నడుమ తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన పెంచులయ్య ఆమెను గొంతునులిమి దారుణంగా హత్యచేసి వెళ్లిపోయాడు. ఈ మేర అందిన ఫిర్యాదు మేరకు నెల్లూరు రెండవ పట్టణ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి నిందితుడు పెంచులయ్యపై కేసు నమోదుచేసి చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి పై మేర తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున అడిషనల్ పిపి రఫిమాలిక్ వాదించారు.