శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆటో బైకు ఢీ - ఆరుగురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట, ఏప్రిల్ 15: మండల పరిధిలోని అత్తిమిట్ట గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో, బైకు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలుకాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు పుదూరు గ్రామానికి చెందిన ఓసూరుమణి, గురుస్వామి, పీరాసి రత్నంలు బైకుపై పట్టణం నుండి స్వగ్రామానికి వెళుతున్నారు. ఇదే సమయానికి చిట్టమూరుమండలం యాకసిరి గ్రామానికి చెందిన ఆటో ప్రయాణికులతో నాయుడుపేటకు వస్తుండగా అత్తిమిట్ట గ్రామం వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు, ఆటోలో ప్రయాణిస్తున్న గోపి, లక్ష్మయ్య, బాలాజీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో రత్నం, బాలాజీలు ప్రాణాపాయ స్థితికి చేరుకొన్నారు. 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొన్న రత్నంను, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలాజీని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఎస్సై వెంకటనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.