రాష్ట్రీయం

అవిశ్వాస రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీలో అధికార, విపక్షాల ఆగ్రహావేశాలు
* సవాళ్లు, ప్రతిసవాళ్లతో అట్టుడికిన సభ తొమ్మిదిన్నర గంటలపాటు ఎడతెగని చర్చ

అవిశ్వాస తీర్మానం అధికార, విపక్షాల మధ్య ఆరోపణల అగ్గి రాజేసింది. నువ్వా.. నేనా అన్న రీతిలో ఇరు పక్షాలు పరస్పరం అభియోగాల కత్తులు దూసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత జగన్ పరస్పర దాడులకు దిగారు. సర్కార్ అవినీతిమయమంటూ 20 ఆరోపణలు సంధించిన జగన్ సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ముందుగా సభకు ఆధారాలు సమర్పించాలని చంద్రబాబు నిలదీశారు. రౌడీయిజం చేస్తే కోరలు తీస్తాననీ హెచ్చరించారు. కేవలం ఆరోపణలు చేసి వెళ్లిపోతామంటే ఊరుకునేదీ లేదన్నారు. రుజువు చేస్తే బాధ్యులపై చర్యలు తప్పవని.. లేకపోతే తప్పుడు ఆరోపణలు చేసినవారినీ వదిలేది లేదన్నారు. ‘బాబూ నీకు సిగ్గుందా’ అంటూ రెచ్చిపోయిన జగన్ వంగవీటి మోహన రంగా హత్య వెనుక బాబు హస్తముందన్న హరిరామ జోగయ్య పుస్తకాన్ని ప్రస్తావించి కలకలం రేపారు. దానితో అధికార పక్ష సభ్యులు ఒంటికాలిపై లేచారు. కోట్లకు కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నారన్న జగన్.. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. బాబువే కాదు, ఆయన మంత్రులవీ అబద్ధాలేనంటూ తీవ్రపదజాలంతో విరుచుకు పడ్డారు. భావోద్వేగ పూరిత వాతావరణంలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ ఒక దశలో ఉద్రేకపూరిత పరిస్థితులకూ దారితీసింది. నిర్విరామంగా తొమ్మిదిన్నర గంటలపాటు జరిగిన చర్చ అనంతరం అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది.