జాతీయ వార్తలు

ఇంటర్వ్యూలకు 31తో స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూనియర్ పోస్టుల భర్తీపై కేంద్ర శాఖలకు ఉత్తర్వులు
నైపుణ్య పరీక్ష కొనసాగింపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా జూనియర్ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో రంగం సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి వరకూ ఇంటర్వ్యూ ప్రాతిపదికగా జరిగిన పోస్టుల భర్తీ ప్రక్రియకు స్వస్తి పలికి జనవరి ఒకటో తేదీ నుంచే కొత్త విధానాన్ని అమలు చేయాలని ఈ ఉత్తర్వులో కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇంటర్వ్యూలు లేకపోయినప్పటికీ నైపుణ్య పరీక్ష, శారీరక ఆరోగ్య పరీక్ష పరీక్షలు మాత్రం యథాతధంగా కొనసాగుతాయని సిబ్బంది, శిక్షణా విభాగం తెలిపింది. ‘ఇంటర్వ్యూ పద్ధతికి 31తో స్వస్తి..కొత్త విధానానికి సిద్ధం కండి’అంటూ అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు పంపిన సర్క్యులర్‌లో తెలిపింది. కేవలం మంత్రిత్వ శాఖల్లోనే కాకుండా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, అనుబంధ సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, పిఎస్‌యూల్లోనూ ఇంటర్వ్యూలు లేకుండానే జూనియర్ స్థాయి ఉద్యోగాల భర్తీ జరగాలని విస్పష్టంగా తెలిపింది. గ్రూప్ సి, గ్రూప్ బి కేటగిరీలో నాన్ గెజిటెడ్ పోస్టులు, తత్సంబంధిత అన్ని పోస్టులనూ కొత్త విధానం ప్రకారమే భర్తీ చేయాలని సిబ్బంది, శిక్షణా విభాగం తెలిపింది. నైపుణ్య పరీక్ష లేదా శారీరక ఫిట్‌నెస్ పరీక్ష అన్నవి తప్పని సరి అని, వీటికి ఇంటర్వ్యూతో సంబంధం ఉండదని వివరించింది. ఇవి కేవలం అర్హతకు సంబంధించినవే తప్ప వీటి ప్రాతిపదికగా ఎలాంటి మార్కులు ఉండవని కూడా వివరించింది.