యువ

మైక్రోసాఫ్ట్ నుంచి నోకియా 230

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది నోకియా 130 స్మార్ట్ఫోన్‌ను ప్రవేశపెట్టి
మంచి లాభాలే గడించిన మైక్రోసాఫ్ట్, తాజాగా నోకియా 230ను డిసెంబర్‌లో తీసుకురాబోతోంది. మధ్య తరగతి, దిగువ మధ్య
తరగతి వారినుద్దేశించిన ఈ ఫోన్ ధర 55 డాలర్లే. 230తోపాటు 230 డ్యుయల్ సిమ్ ఫోన్‌ను కూడా ఒకేసారి ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. టు మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 32జిబి ఎక్స్‌టర్నల్ స్టోరేజి వంటి ఫీచర్లతో, అల్యూమినియం బ్యాక్ కవర్‌తో నోకియా 230 ఆకట్టుకునేలానే ఉంది.

‘యాప్’తో మంటలకు చెక్
దక్షిణ ఆస్ట్రేలియాలో ఈ మధ్య అడవులు అంటుకున్నాయి. ఆ దావాగ్ని ఇళ్లూ వాకిళ్లనూ, పశు పక్ష్యాదులను కబళించేసింది. దాదాపు 27వేల జంతువులు మాడిమసైపోయినట్టు అంచనా. ఇంత ప్రళయం సంభవించినా, ఓ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలబడింది. దావానలం సంభవించిన ప్రాంతంలోనే ప్రొఫెసర్ సిమన్ మాడాక్స్ ఫామ్‌హౌస్ ఉంది. అక్కడికి 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్లెస్ డార్విన్ యూనివర్శిటీలో మాడాక్ వైస్ చాన్సలర్‌గా పనిచేస్తున్నారు. తన ఫామ్‌హౌస్‌కు అమర్చిన సెక్యూరిటీ కెమెరాల ద్వారా మంటలు ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టడానికి ఇంకెంతో సమయం పట్టదని తెలుసుకున్నారు. ఆ క్షణంలో ఆయన బుర్ర పాదరసంలా పనిచేసింది. ఫామ్‌హౌస్‌లో వ్యవసాయానికి ఉపయోగించే స్ప్రింక్లర్లను తన స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా ఆన్ చేశారు. ఇంకేముంది? ఫామ్‌హౌస్ నాలుగు దిశలా నీరు వెల్లువెత్తి మంటలు ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టకుండా కాపాడాయి. చుట్టుపక్కల ఉన్నవారు కూడా సమయానికి వచ్చి మంటలను చల్లార్చడంలో సాయపడ్డారట. థాంక్స్ టు టెక్నాలజీ!

లిటిల్ బిట్స్
చిన్నారులకు కిక్కెక్కించే గాడ్జెట్
పిల్లల చదువుపట్ల పెద్దలు ఆందోళన చెందడం సహజమే. వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతూంటారు. అలాంటివారికోసం వచ్చిందే లిటిల్ బిట్స్ గిజ్‌మోస్ అండ్ గాడ్జెట్స్ కిట్. రకరకాల రంగుల్లో ఉండే కోడెడ్ సర్క్యూట్లు, కంట్రోల్ బోర్డులు, వైరింగ్‌తో ఉండే ఈ పరికరాల వాడకాన్ని పిల్లలకు అలవాటు చేయడం ద్వారా వీడియో గేమ్ పరికరాలు, స్మార్ట్ఫోన్లు వంటి పరికరాలు ఎలా పనిచేస్తాయనే విషయంపై కనీస పరిజ్ఞానాన్ని అలవరచుకోవచ్చట. *

గార్మిన్ వారియా
సైకిళ్లకు శ్రీరామరక్ష!
రద్దీ రోడ్లపై సైకిల్‌పై వెళ్లాలంటే ఎవరికైనా భయమే. పక్కనుంచి దూసుకుపోయే స్కూటర్లు, వెనకాలనుంచి వచ్చే కార్లు ఎక్కడ గుద్దుకుంటాయోనని భయపడటం సహజం. అయితే గార్మిన్ వారియా అనే రాడార్ డిస్‌ప్లే గాడ్జెట్‌ను సైకిల్‌కు అమర్చుకుంటే ఇక ఆ భయం ఉండదు. వెనకాలనుంచి వచ్చే కార్ల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇది అందజేస్తుంది. దానిని బట్టి మనం జాగ్రత్త పడొచ్చన్నమాట.