రాష్ట్రీయం

ఎన్‌టిపిసిలో సాంకేతిక లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం 4వ యూనిట్ ట్రిప్

గోదావరిఖని, నవంబర్ 21: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్‌టిపిసిలో వివిధ సాంకేతిక లోపాలతో 3 విద్యుత్ యూనిట్ల నుండి 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి శనివారం రోజున నిలిచిపోయింది. రోజుకు 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిపే ఎన్‌టిపిసిలో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగడంతో దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఎదుర్కోవాల్సి వచ్చింది. శనివారం ఉదయం 500 మెగావాట్లకు చెందిన 4వ విద్యుత్ యూనిట్ ట్యూబ్ లీకేజీతో ట్రిప్ అయి ఉత్పత్తి నిలిచిపోయింది. దీనికి తోడుగా 3 రోజుల క్రితమే 7వ 500 మెగావాట్ల యూనిట్ ట్రిప్ కావడంతో దానిని మరమ్మతులను జరుపుతూ ఉత్పత్తిని నిలిపివేశారు. అదేవిధంగా 200 మెగావాట్లకు చెందిన 1వ విద్యుత్ యూనిట్ 7 రోజుల నుండి వార్షిక మరమ్మతులకోసం ఉత్పత్తిని నిలిపివేశారు. దీనివల్ల ఎన్‌టిపిసిలో ఒకేరోజు 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో దక్షణాది రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. 4వ 500 మెగావాట్ల విద్యుత్ యూనిట్‌ను మళ్లీ ఉత్పత్తి దశలోకి తీసుకురావడంకోసం అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం 500 మెగావాట్లకు చెందిన 2 యూనిట్లు, 200 మెగావాట్లకు చెందిన 2 యూనిట్ల నుండి 1400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.