బిజినెస్

ఎస్‌టిపిపి మొదటి 600 మెగావాట్ల యూనిట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింక్రనైజేషన్ ప్రక్రియను ఆరంభించిన సింగరేణి సిఎండి శ్రీధర్
జైపూర్, మార్చి 13: ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక సంస్థ సింగరేణి నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు (ఎస్‌టిపిపి)లో తొలి 600 మెగావాట్ల యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియను ఆదివారం సింగరేణి సిఎండి శ్రీధర్ ప్రారంభించారు. ఇక్కడ సంస్థ నిర్మిస్తున్న 600 మెగావాట్ల సామర్థ్యంగల రెండు యూనిట్ల లో మొదటి యూనిట్ నిర్మాణం పూర్తికావటంతో ఆదివారం అధికారికంగా అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా యూనిట్‌లోగల బాయిలర్‌లోని 8 బంకర్లను బొగ్గుతో నింపి ఫర్నేస్ ఆయిల్‌తో మండించారు. దీంతో 600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్‌లో 580 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఈ సందర్భంగా సిఎండి శ్రీధర్‌తోపాటు సంస్థ డైరెక్టర్లు, బిహెచ్‌ఈ ఎల్ సిబ్బంది, సింగరేణి అధికారులు కరతాళధ్వనులు చేశారు. ప్లాంటుకు బొగ్గును పంపించే ట్రాక్ హాపర్‌తోపాటు ఇంకా ముఖ్యమైన కొన్ని పనులు జరగాల్సి ఉండటంతో రెండు యూనిట్లను మే నెల మొదటి వారం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించ నున్నట్లు శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు రమేష్ బాబు, మనోహర్ రావు, పవిత్రన్ కుమార్, ప్లాంటు ఈడి సంజయ్ కుమార్ సూర్, జిఎంలు సుధాకర్ రెడ్డి, మురళీ కృష్ణ, ఎఐటియూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, ఐఎన్‌టిసి వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు, టిజిబికెఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు. (చిత్రం) థర్మల్ ప్లాంటు కంట్రోల్ ప్యానల్‌లో 578 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతున్నట్లున్న దృశ్యం. చిత్రంలో సింగరేణి సిఎండి శ్రీధర్