బిజినెస్

ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో ఎన్టీఆర్ గృహాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీతో 180 రోజుల్లో పూర్తి
గృహ నిర్మాణ శాఖకు ఏపి ప్రభుత్వ ఆదేశాలు
కాకినాడ, డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి 180 రోజుల్లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టేలా గృహ నిర్మాణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ గృహాలకు యూనిట్‌కు రూ. 2.75 లక్షలు ఖర్చవుతుండగా, అందులో ఎస్సీ ఎస్టీలకు లక్షా 75 వేలు, ఇతరులకు లక్షా 25 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తోంది. దీనితోపాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమం క్రింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 15 వేలు మంజూరు చేస్తారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం క్రింద ఈ గృహాలను 275 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. రెండు బెడ్ రూంలు, హాలు, స్నానాల గది, వంట గది, మరుగుదొడ్డి సదుపాయాలతో అధునాత రీతిలో నిర్మించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.
అలాగే కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టే అందరికీ ఇళ్లు పథకం కింద యూనిట్‌కు వ్యయం 4.80 లక్షలతో ఇళ్లు నిర్మించనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ. 1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 వేలు సబ్సిడీగా అందిస్తుంది. 2 లక్షలు బ్యాంకు రుణం, రూ. 50 వేలు లబ్ధిదారుడి వాటాగా నిర్ణయించారు. వౌలిక వసతుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 70 వేలు సమకూరుస్తుంది. ఈ రెండు పథకాలకు సంబంధించిన ఇళ్లను ఆయా జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రుల ఆమోదంతో రాష్టస్థ్రాయిలో మంజూరు చేయాలని నిర్ణయించారు. ప్రాంతాల వారీగా లబ్ధిదారులను జన్మభూమి గ్రామ కమిటీల ద్వారా ఎంపికచేయనున్నారు. గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక, అర్హతల పరిశీలనలో ఆర్‌డిఒలు, హౌజింగ్ ఇంజనీర్లు ప్రత్యేక బాధ్యత వహిస్తున్నారు. ఈ ఎంపిక ప్రక్రియను డిసెంబర్ 21వ తేదీకి పూర్తిచేయాలని ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. కాగా, ఈ పథకానికి సంబంధించి నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఒకేచోట 15 గృహాల నిర్మాణం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. 15 గృహాలకు ఒకేచోట స్థలం దొరికే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిబంధన సడలింపునకై ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్టు ఇటీవల ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాకినాడలో నిర్వహించిన సమీక్షలో హామీ ఇచ్చారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లోని కాలనీల్లో ఎక్కడ స్థలం లభ్యత ఉంటే అక్కడ గృహాల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి నియోజకవర్గానికి కనీసం వెయ్యి ఎన్టీఆర్ గృహాలు మంజూరయ్యే విధంగా చూస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో కేటాయింపులు జరిగిన ఇందిరా ఆవాస్ యోజన గృహాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ గృహ నిర్మాణం క్రింద ప్రతి నియోజకవర్గానికి కనీసం వెయ్యికి తగ్గకుండా గృహాలు మంజూరయ్యేలా కృషి చేస్తామని ఆయన ప్రకటించారు.