ఎన్టీఆర్ నోట..కన్నడ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఇటీవలే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఎన్టీఆర్ నటుడిగానే కాక, ఈమధ్య తను నటిస్తున్న సినిమాల్లో పాటలు కూడా పాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆయన తన స్నేహితునికోసం కన్నడంలో ఓ పాట పాడాడు. ప్రముఖ కన్నడ నటుడు పునిత్ రాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ‘చక్రవ్యూహ్’ సినిమాకోసం ఎన్టీఆర్ పాట పాడాడు. థమన్ సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాటను ఇటీవలే రికార్డ్ చేశారు. పునిత్‌రాజ్‌కుమార్ సినీ జర్నీ ప్రారంభించి 25 వసంతాలు అయిన సందర్భంగా ప్రత్యేకంగా ఉండాలని, ఎన్టీఆర్‌తో ఈ పాట పాడించాడట. పునిత్ ఎన్టీఆర్ ఇద్దరూ మంచి స్నేహితులు. తన మిత్రుడికోసం పాడిన ఈ పాటను ఈనెల 8న బెంగళూరులో అట్టహాసంగా విడుదల చేయనున్నారు. మొత్తానికి ఈ సినిమాకు ఎన్టీఆర్ పాడిన పాట హైలెట్‌గా నిలుస్తుందని అనుకుంటున్నారు సినీ జనాలు.