నిజామాబాద్

అవయవ దానానికి ముందుకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మార్చి 21: అన్ని దానాల్లోకెళ్లా అవయవదానం చాలా గొప్పదని, అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని శ్రావ్య గార్డెన్‌లో కె6, జీవన్‌దాన్ ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన సదస్సు, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మరణానంతరం తన శరీర అవయవాలను దానం చేసేందుకు అంగీకరిస్తూ రిజిస్ట్రేషన్ పత్రాన్ని కలెక్టర్ అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, బతికి ఉన్నప్పుడే కాకుండా మరణానంతరం కూడా 10మందికి ఉపయోగపడే విధంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. ఈ ప్రపంచంలో మనిషిగా జన్మించడం భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరమని, సామాజిక బాధ్యతతో వ్యవహరించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. మరణాంతరం మన శరీరాన్ని దానం చేయడం వల్ల తీవ్ర అనారోగ్యంతో జీవన్మరణ స్థితిలో ఉన్న 10మందికి వ్యక్తులకు మన శరీర అవయవాలను అమర్చడం వల్ల 10కుటుంబాల్లో సుఖఃసంతోషాలను వెలగించిన వారము అవుతామని అన్నారు. అవయవదానం వల్ల మరణానంతరం కూడా మనం జీవించగలుగుతామని అన్నారు. మనలో తిరుగుతూ చాలా ఉత్సాహంగా కనిపించే వ్యక్తులు కూడా ఆకస్మాత్తుగా నీరసపడిపోతారని, అందుకు కారణం వారి శరీరంలో ఉన్న కీలక అవయవాలు దెబ్బతినడమేనని అన్నారు. మృతి చెందిన వ్యక్తికి దాహనం చేస్తే బూడిద అవుతుందని, పూడ్చిపెడితే మట్టిలో కలిపోవడం జరుగుతుందన్నారు. కానీ, జీవన్‌దాన్‌కు మన శరీరాన్ని అందజేస్తే గుండె, లివర్, కిడ్నీ, కళ్లు తదితర అవయవాలను అవసరమైన వ్యక్తులకు ఉచితంగా మార్పిడి చేయడం జరుగుతుందని, తద్వారా మనం తిరిగి వారిలో జీవించగలుగుతామని అన్నారు. ఈ విషయంలో బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌కు చెందిన 18మంది సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. వీరంతా మరణానంతరం తమ శరీరాలను నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అందజేసే ప్రమాణ పత్రాలను ఇవ్వడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరు అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అవయవదానాన్ని ప్రోత్సహిస్తోందని, అవయవదానం నేడు వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైందని కలెక్టర్ అన్నారు. రాబోయే మూడు మాసాల్లో జీవన్‌దాన్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కార్యక్రమంలో డాక్టర్ భూషణ్‌రావు మాట్లాడుతూ, అవయవ మార్పిడి చేయించుకున్న వ్యక్తులు రెండు నెలల్లో సాధారణ జీవితాన్ని గడపవచ్చని, అయితే మందులను మాత్రం రెగ్యులర్‌గా వాడాల్సి ఉంటుందన్నారు. శరీరాన్ని దానం చేసిన వ్యక్తికి సంబంధించిన అవయవాల ద్వారా దయనీయ స్థితిలో ఉన్న 10మందికి అవయవాలను మార్పిడి చేసి ఆరోగ్యవంతులుగా చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జీవన్‌దాన్ ప్రతినిధులు డాక్టర్ సురేష్‌కుమార్, డాక్టర్ విశాల్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా, కె6 ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు.