నిజామాబాద్

ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి టౌన్, ఫిబ్రవరి 20: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బైక్ దొంగతనాలు చేస్తున్న 5గురు సభ్యులు గల ముఠాను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డిఎస్పీ ప్రసన్నరాణి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌కు చెందిన షేక్ వౌలా, షేక్ ఇర్ఫాన్, షేక్ సాబెర్, దావుద్, సాబీల్‌లు ముఠాగా ఏర్పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో 4, నిజామాబాద్ 3వ టౌన్ పరిధిలో 5, దేవునిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 1బైక్ చోరీ చేయడం జరిగిందన్నారు. వీరందరూ మేస్ర్తి పనితో పాటు సెంట్రింగ్ పనిచేస్తు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా ఆటోలు, బస్సుల్లో ఒకేసారి వచ్చి వెళ్లెటప్పుడు బైక్‌లను దొంగతనాలు చేస్తు వెళ్తుండేవారు. నిజాంసాగర్ చౌరస్తాల్లో తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడ్డారన్నారు. వీరి వద్ద నుండి 9బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో బైక్‌తో పాటు దొంగలించిన సామాగ్రిని పాత స్క్రాప్ దుకాణాల్లో అమ్మినట్లు విచారణలో వెల్లడించారన్నారు. ఈ సమావేశంలో టౌన్ సిఐ శ్రీధర్‌కుమార్, ఎస్‌ఐ రాజు, ఐడి పార్టీ సిబ్బంది ఉస్మాన్, సరుూ్యద్, రాజశేఖర్, విజయ్, తదితరులున్నారు. వీరందరికి రివార్డుల కోసం సిఫార్సు చేసినట్లు డిఎస్పీ తెలిపారు.

నిజామాబాద్ వరకు ట్రాయల్న్‌క్రు సమాయత్తం
మోర్తాడ్, ఫిబ్రవరి 20: పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ వరకు రైలు నడిపేందుకు అధికారులు ట్రాయల్న్ కార్యక్రమానికి సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రైల్వే సేఫ్టీ బృందం సోమవారం సన్నాహక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ శ్రీరాంకృపాల్ నేతృత్వంలో సేఫ్టీ బృందం ప్రత్యేక రైలులో కరీంనగర్ నుండి మోర్తాడ్‌కు వచ్చారు. నిజామాబాద్ వరకు ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాక్ లైనింగ్, ఆన్‌లైన్ సదుపాయాలను స్థానిక రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు మాసాల క్రితమే మోర్తాడ్ వరకు రైలును ప్రారంభించిన అధికారులు, ఏప్రిల్ మాసాంతం వరకు నిజామాబాద్ వరకు ఈ రైలును నడుపుతామని ఆ సమయంలో ప్రకటించారు. జిల్లా ఎంపి కల్వకుంట్ల కవిత కూడా దీని విషయమై ప్రత్యేక దృష్టిసారించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించడంతో పాటు ఏప్రిల్‌లో రైలును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రైల్వే బడ్జెట్‌కు ముందు ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రికి వినతిపత్రాలను కూడా అందజేశారు. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు ట్రాయర్న్ నిర్వాహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే సేఫ్టీ కమిషనర్ శ్రీరాంకృపాల్ ప్రత్యేక రైలులో మోర్తాడ్ వరకు వచ్చి, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు. మాక్లూర్ మండలం మామిడిపల్లి వద్ద జరుగుతున్న ఆర్‌ఓబి పనుల నేపథ్యంలో అక్కడ రైల్వే క్రాసింగ్ గేట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు ఉండటంతో వాటిని సరిదిద్దాలని ఆయన అధికారులకు ఆదేశించారు. అనంతరం అదే ట్రైన్‌లో నిజామాబాద్ వరకు వెళ్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారీ రైల్వే పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాస్తవానికి ప్రస్తుతం జగిత్యాల్-మోర్తాడ్‌ల మధ్య నడుస్తున్న రైలు వేకువజామున 4గంటలకు, రాత్రి 8గంటలకు ఉండటంతో మధ్యాహ్న సమయంలో వచ్చిన ట్రైయిన్‌ను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. నిజామాబాద్ వరకు రైలును ప్రారంభిస్తే, ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పెరుగుతాయని, తద్వారా సుదూర ప్రాంతాలకు కూడా వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని అక్కడికి వచ్చిన ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రైల్వే శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి రైలు రాకను నిజామాబాద్ వరకు పొడిగించాలని వారు కోరారు.