నిజామాబాద్

83 వేల కోట్లతో గోదావరి సాగునీటి మళ్లింపు పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, ఫిబ్రవరి 26: గోదావరి వృధా జలాలను మళ్లించేందుకోసం రాష్ట్ర సిఎం కెసిఆర్ 83వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖామాత్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ప్రధాన కాలువ నీటి విడుదలను పరిశీలించిన అనంతరం, మంత్రి విలేఖరులతోమాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రీడిజైన్ చేసి రైతుల పంటలను సస్యశ్యామలం చేసేందుకోసం 83వేల కోట్లరూపాయలను అంచనా వేయడం జరిగిందని, 25వేల కోట్ల రూపాయలతోపనులు ప్రారంభించడం జరిగిందన్నారు. వీటిలో 10వేల కోట్ల రూపాయల పనులు పూరె్తైయ్యాయన్నారు. 18 నెలల్లో కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోనికి నీటిని నింపండం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలోని 50 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు లక్ష్యం పెట్టుకున్నామన్నారు. గ్రామాలలో త్రాగునీటి సమస్య లేకుండా ఉండేందుకోసం మిషన్ భగీరథ పథకాన్ని సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగ అమలు చేయడం జరిగిందన్నారు. ఈపథకం కోసం 42వేల కోట్లరూపాయలను ఖర్చు చేసి పైప్‌లైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుకింద 2లక్షల పది వేల ఎకరాలలో రైతులు పంటలు సాగుచేస్తున్నారని, గుంట భూమి ఎండకుండా, సాగు నీటిని అందించేందుకు అన్నిరకాల చర్యలుతీసుకుంటున్నామన్నారు. డిస్ట్రీబ్యూటర్ల వద్ద గ్రామ సేవకులు, విఆర్‌ఓలు, నీటిపారుదల శాఖ సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంచడం జరిగిందన్నారు.ప్రాజెక్ట్ ద్వారా మూడు విడతల్లో 8 టిఎంసిల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులు వేసిన పంటలు వెయ్యి కోట్ల రూపాయలు పంటల ద్వారా ఆదాయం వస్తుందన్నారు. రైతులు వేసిన పంటలు చేతికి వచ్చేందుకు మరో నాలుగుతడు నీరు అవసరముందని అన్నారు. ప్రాజెక్ట్ చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేందుకు పది రోజుల పాటు కాలువ వెంట ఎప్పటి కప్పుడు తాను స్వయంగా పర్యవేక్షణ చేయడం జరుగుతోందన్నారు. ఏక్షణంలోనైనా ఎక్కడైనా పర్యవేక్షిస్తానన్నారు. మంత్రి వెంట జడ్పీ చైర్మైన్ దఫేదార్‌రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత షిండే, మండల కో-ఆఫ్షన్ సభ్యులు అహ్మద్ హుసెన్, నాయకులు వినయ్‌కుమార్, వాజిద్ అలీ, కాశయ్య, మహేందర్, వెంకట్‌రాంరెడ్డి, ఎజాజ్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిజాంసాగర్ నీటి విడుదలను పరిశీలించిన మంత్రి పోచారం
నిజాంసాగర్, ఫిబ్రవరి 26: నిజాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా యాసంగిలోరైతులు వేసిన పంటలను రక్షించేందుకోసం విడుదల చేసిన నీటిప్రవాహాన్ని ఆదివారం రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీచైర్మైన్ ధఫేదార్‌రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేతోకలసి పరిశీలించారు. ఈసందర్భంగా డిస్ట్రీబ్యూటరీ 1, 2,3,4లను పరిశీలిస్తూ, ప్రధాన కాలువ వెంట నీటి ప్రవాహాన్ని వారు పరిశీలించారు. డిస్ట్రీబ్యూటర్‌ల కింద ఆయకట్టు విస్తీర్ణాన్ని బట్టి, నీటిని విడుదల చేయాలని, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ గంగాధర్, ఈఈ సత్యశీలారెడ్డిలను ఆదేశించారు. చుక్కనీరుకుడావృధా కాకుండా నీటిని పొదుపుగా వాడుకునేందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నీరు వృధాఅవుతే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఏక్షణంలోనైనా తాను స్వయంగా డిస్ట్రీబ్యూటర్‌లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతోందన్నారు. ఆతర్వాత మంత్రి రైతులు వేసిన వరి పంటను పరిశీలించారు. మంత్రి వెంట నాయబ్ తహశీల్దార సయిద్ అహ్మద్ మస్రూర్, గిర్దావర్ సయ్యద్ హుసెన్, డిప్యూటీ ఈఈ దత్తాత్రి, ఏఈ శివకుమార్, నాయకులు తదితరుల పాల్గొన్నారు.

కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేస్తా
* జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం
నిజాంసాగర్, ఫిబ్రవరి 26: జుక్కల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని , జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం అన్నారు. ఆదివారం నిజాంసాగర్ మండలంలోని నర్వ, మాగి గ్రామాలలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోసమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతోమాట్లాడుతూ, నియోజకవర్గంలోకాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, పార్టీకి పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు తన వంతుగాకృషి చేస్తానన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేఖ పనులను ఎండగడ్తామన్నారు. గ్రామాలలోకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్య పడవద్దని, తాను ఎళ్లవేళల అందుబాటులోఉంటానన్నారు. పెద్దకొడప్‌గల్ మండల కేంద్రంలోతానుప్రజలకు అందుబాటులోఉండి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విలేఖరుల సమావేశంలోమాజీ మార్కెట్ కమిటి చైర్మైన్ చీకోటి రామకిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రోళ్ల సాయులు, మైపాల్‌గౌడ్, నర్సింహరెడ్డి, రాంరెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఎర్రజొన్న రైతులకు కాంగ్రెస్ అండ
* డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్
మోర్తాడ్, ఫిబ్రవరి 26: ఆరుగాలం శ్రమించిన ఎర్రజొన్న రైతులు మధ్య దళారుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ పేర్కొన్నారు. ఈ నెల 28న ఎర్రజొన్న రైతులు నిర్వహిస్తున్న ఛలో ఆర్మూర్ కార్యక్రమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం మోర్తాడ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండున్నర దశాబ్దాలుగా ఆర్మూర్ ప్రాంత రైతులు ఎర్రజొన్న పంటను సాగు చేస్తున్నారని, ప్రతియేటా దళారుల వల్లో, వ్యాపారుల వల్లో నష్టాలను చవి చూస్తున్నారని అన్నారు. ఈసారి పంట సమృద్ధిగా పండినప్పటికీ, రైతుల శ్రమను వ్యాపారులు దోచుకుంటున్నారని అన్నారు. తరుగు పేరిట 10శాతం ధాన్యాన్ని దళారులే తీసుకుంటున్నారని, పైగా గిట్టుబాటు ధరను కూడా భారీగా తగ్గించి వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మార్క్‌ఫెడ్ ద్వారా గానీ, విత్తనాభివృద్ధి సంస్థ ద్వారాగానీ ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులచే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దళారుల దోపిడిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు కోరినట్లుగా క్వింటాళుకు 4వేల రూపాయల గిట్టుబాటు ధరను ప్రకటించాలన్నారు. ఈ నెల 28న ఆర్మూర్‌లో జరుగనున్న ఎర్రజొన్న రైతుల సదస్సుకు మద్దతు ఇవ్వడంతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో డిసిసి నాయకులు అనే్వష్‌రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు దేవేందర్, మోత్కూ భూమన్న తదితరులు పాల్గొన్నారు.

అప్పుల బాధ తాళలేక విఆర్‌ఎ ఆత్మహత్య
నవీపేట, ఫిబ్రవరి 26: కూతురు పెళ్లి చేసిన అప్పులు పెరిగిపోగా, వాటిని తీర్చలేననే బాధతో ఓ విఆర్‌ఎ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నవీపేట మండలం బినోల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన గంగాధర్(41)అనే వ్యక్తి అదే గ్రామంలో విఆర్‌ఎగా పని చేస్తున్నాడు. ఇటీవల మృతుడు గంగాధర్ కుమార్తె నిఖితకు పెళ్లీడు రావడంతో సుమారు 6లక్షల రూపాయలు వెచ్చించి అన్ని లాంఛనాలతో వివాహం చేశాడు. అయితే మృతుడికి ఆరోగ్యం సహకరించకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో తనకున్న ఒక ఎకరం భూమిని విక్రయించి అప్పులు తీర్చాలని నిర్ణయించుకోగా, ఇదే విషయమై శనివారం రాత్రి భార్య అయిన రోజాతో చర్చించడం జరిగిందన్నారు. అయితే పొలం అమ్మేందుకు రోజా ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన గంగాధర్, ఇంట్లో అందరు నిద్రపోయిన తర్వాత శనివారం రాత్రి 11గంటల సమయంలో పురుగుల మందు సేవించడం జరిగిందన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు గంగాధర్‌ను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 2గంటలకు మృతి చెందినట్లు నవీపేట పోలీసులు తెలిపారు. మృతుడి కుమార్తె నిఖిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు నవీపేట పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో తల్లీ, కొడుకు మృతి
బాల్కొండ, ఫిబ్రవరి 26: మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారి దూదిగాం ఎక్స్‌రోడ్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చాకిర్యాల గ్రామానికి చెందిన సృజన(25), ఆమె కుమారుడు సుమిత్‌రెడ్డి(13మాసాలు)లు మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతురాలి తండ్రి అయిన సామ గంగారెడ్డి తన ద్విచక్ర వాహనంపై సృజనను, ఆమె కుమారుడిని ఎక్కించుకుని జాతీయ రహదారిపైకి చేరుకోగా, నిర్మల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న నిర్మల్ డిపోకు చెందిన రాజధాని ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీకొట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో సుమిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన సృజనను చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. అదే విధంగా ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గంగారెడ్డిని చికిత్స నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ముచ్కూర్‌లో వైద్య శిబిరం
భీమ్‌గల్, ఫిబ్రవరి 26: భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో లక్ష్మినర్సింహా ఐ కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వైద్య నిఫుణుడు డాక్టర్ యాదగిరి రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో 200 మందికి వైద్య పరీక్షలు చేయడం జరిగిందని డాక్టర్ తెలిపారు. వీరికి మందులతో పాటు కంటి అద్దాలను ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరాన్ని సర్పంచ్ తులసిగౌడ్ ప్రారంభించారని అన్నారు. శిబిరంలో విడిసి అధ్యక్షుడు అంతంగౌడ్, వార్డు సభ్యులు లక్ష్మినారాయణ, గట్టు మురారీ, శ్రీనివాస్‌తోపాటు యూత్ సభ్యులు పాల్గొని సేవలు అందించారని అన్నారు.
రైల్వేగేట్‌ను ఢీకొన్న ట్రాక్టర్
కామారెడ్డి రూరల్, ఫిబ్రవరి 26: మండలంలోని నర్సన్నపల్లి గ్రామ శివారులోగల రైల్వేగేట్‌ను ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ ఢీ కొంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం సరంపల్లి వైపునుండి నర్సన్నపల్లి గ్రామంవైపు వెళ్తున్న ట్రాక్టర్ వెళ్తుందని తెలిపారు. రైలు వస్తున్నందున రైల్వే గేట్‌మెన్ గేటు మూసి ఉంచాడు. ట్రాక్టర్ డ్రైవర్ మూసి ఉంచిన గేటును చూసి ట్రాక్టర్ బ్రేకులు వేయడంతో బ్రేకులు ఫేలవడంతోడ్రైవర్ ఎంత ప్రయత్నించిన ట్రాక్టర్ ఆగకపోవడంతో రైల్వే గేటును ఢీకొంది. పాత హైవే రోడ్డు కావండంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కామారెడ్డి రైల్వే పోలీసులను వివరాలు అడిగితే తమ వద్దకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, వివరాలు లేవని తెలిపారు.

గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు
తాడ్వాయి, ఫిబ్రవరి 26: గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు గాయపడిన సంఘటన ఆదివారం మండల కేంద్రంలోని కన్‌కల్ గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకార ం గ్రామానికి చెందిన వెల్మ ప్రతాప్‌రెడ్డి, ఆయన కుమార్తె జ్యోతిలు తమ ఇంట్లో సిలిండర్ అయిపోగా దానిని మార్చుతుండగా గ్యాస్ లికై మంటలు చెలరేగాయని దీంతో ప్రతాప్‌రెడ్డికి కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. జ్యోతి చేతులకు స్వల్ఫ గాయాలయ్యాయి. ఇంట్లో మంటలు చెలరేగడంతో స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అదుపు కాకపోవడంతో అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకోని ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదుచేసుకోని దర్యాప్తు చేపట్టారు.

అఖిలను ఆదుకోండి
కమ్మర్‌పల్లి, ఫిబ్రవరి 26: ఆ బాలిక వయస్సు 13సంవత్సరాలు. నాల్గవ తరగతి నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారికి ఇన్సులిన్ తీసుకుంటునే రోజు గడిచే పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు తాము రోజువారిగా పడిన కష్ట ఫలితాన్ని కూతురి ఇంజక్షన్లకే ఖర్చు చేయాల్సిన దయానీయ పరిస్థితి ఏర్పడింది. దాతలో, ప్రభుత్వమో ఆదుకుంటే తప్పా ఆ కుటుంబానికి చేయూత లభించే పరిస్థితి లేదు. కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన నర్సయ్య-సువర్ణ దంపతులకు ముగ్గురు సంతానం, రెండవ కుమార్తెగా జన్మించిన అఖిలకు 9సంవత్సరాల వయస్సులోనే మధుమేహం వ్యాధి సోకింది. తల తింపడం, పడిపోవడం తదితర లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అఖిలను ఆ సమయంలోనే కరీంనగర్ ఆసుపత్రిలో చూపించడంతో మధుమేహం వ్యాధి ఉన్నట్లుగా నిర్ధారించారు. మొదట్లో చిన్నపాటి ట్యాబ్లెట్స్‌తోనే మధుమేహాన్ని అదుపులో పెట్టుకున్నప్పటికీ, పెరుగుతున్న కొద్దీ మధుమేహం తీవ్రత కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కమ్మర్‌పల్లి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అఖిలకు షుగర్ లెవల్ 500పైచిలుకుగా ఉంటున్నట్లుగా వైద్య పరీక్షలు స్పష్టం చేశాయి. దీంతో వైద్య నిఫుణుల సూచనల మేరకు ఉదయం, సాయంత్రం ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అఖిలకు ఏర్పడింది. ఇన్సులిన్ తీసుకుంటేగానీ షుగర్ లెవల్ 200లకు తగ్గుతున్నాయని, లేనిపక్షంలో 500పైనే ఉంటుందని బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న అఖిల వైద్యం ఖర్చులను భరించే స్థోమత లేక ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని కూడా అమ్ముకున్నామని అఖిల తల్లిదండ్రులు వాపోయారు.