నిజామాబాద్

యుపిలో వర్షం పడితే... తెలంగాణలో గొడుగులు పడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మార్చి 31: ఉత్తరప్రదేశ్‌లో వర్షం కురిస్తే, ఇక్కడ గొడుగులు పడుతున్న చందంగా తెలంగాణ ప్రాంత బిజెపి నాయకుల వ్యవహార శైలి తయారైందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికి తెరాస ఇతోధికంగా కృషి చేస్తుంటే, ప్రగతిని సాధించిన ఘనత తమదేనని బిజెపి నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇకపై ఉగాది పంచాంగం తరహాలో తాను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఏటేటా వివరిస్తానని, లేనిపక్షంలో తాము చేపట్టిన పనులను కూడా ప్రతిపక్షాలు తమ ఖాతాలో వేసుకుంటారని అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లోని తన నివాస గృహంలో ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, ఇందులో భాగంగానే పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్ పనులను పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమించి గడిచిన మూడు సంవత్సరాల నుండి పెద్ద మొత్తంలో నిధులు సాధించి పనులను పూర్తి చేయించామన్నారు. అయితే మూడేళ్ల క్రితమే తాను లేఖ అందించానంటూ ఒకరు, తామె నిధులను తెచ్చామంటూ మరో పార్టీ నాయకులు ఎవరికివారు గొప్పలు పోతున్నారని విమర్శించారు. నిజానికి కేంద్రంలో సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఐదేళ్ల కాలంలో 89 కోట్ల రూపాయలకు మించి ఇదివరకటి నేతలు నిధులు సాధించలేకపోయారని, అధికార పక్షం కానప్పటికీ పట్టుదలతో ప్రయత్నిస్తే పనులు జరుగుతాయని తాము పెద్దపల్లి రైల్వే లైన్ పనులను పూర్తి చేయించడం ద్వారా నిరూపించామన్నారు. పెద్దపల్లి రైల్వేలైన్‌తో పాటు తాగునీరు, సాగునీరు, పసుపు బోర్డు ఏర్పాటు అంశాలను తాను ఎన్నికల్లో ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. పై నాలుగు వాగ్ధానాలను కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రైల్వే లైన్ పనులు పూర్తయ్యి ఇటీవలే రైళ్ల రాకపోకలు ప్రారంభం అయ్యాయని, పసుపు బోర్డు కోసం పార్లమెంటులో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టానని అన్నారు.
అదేవిధంగా సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు వీలుగా నిజాంసాగర్ ఆధునికీకరణకు 149 కోట్ల రూపాయలను వెచ్చించామని, ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతులు, ఆధునికీకరణకై 135 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. మిషన్ కాకతీయ పనుల వల్ల 4లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం 8 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 750 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారుల విస్తరణ, మరమ్మతు పనులు చేపట్టామని, జాతీయ రహదారుల విస్తరణ కోసం 231 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. రైతాంగ శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ రైతులకు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎర్రజొన్న బకాయిలను తెరాస ప్రభుత్వమే చెల్లించిందని ఎంపి కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంతో పాటు మున్సిపల్ పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నామని, కార్పొరేషన్‌కు ఏటా వంద కోట్ల రూపాయలను అభివృద్ధి పనులు, వౌలిక సదుపాయాల కల్పనకై ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. నిజామాబాద్ నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం 231కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులను పూర్తి చేయిస్తున్నామని చెప్పారు. జిల్లాకు పసుపు పార్కును కేటాయిస్తూ ప్రభుత్వం 30కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ వేగం పుంజుకుందని, నిర్ణీత గడువులోగా వీటి నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన వారికి కేటాయిస్తామని తెలిపారు. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తుచ తప్పకుండా అమలు చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం తాము అహరహం శ్రమిస్తుంటే, బిజెపి నాయకులు ఇదంతా తమ గొప్పేనని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిజానికి రైతులకు మద్దతు ధర అందించడంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎంపి కవిత ఆక్షేపించారు. మద్దతు ధర విషయమై నిర్దిష్ట విధానాన్ని అమలు చేయని కారణంగా మిర్చి, పసుపు తదితర పంటలు సాగు చేస్తున్న రైతులకు మద్దతు ధర లభించడం లేదని, వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఇటీవల పార్లమెంటులో తాను ప్రస్తావించానని, ఈ దిశగా కేంద్రంపై మునుముందు మరింత ఒత్తిడి తెచ్చి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్తా, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత, నెడ్‌క్యాప్ చైర్మన్ ఎస్‌ఎ.అలీమ్, తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

కు.ని ఆపరేషన్లు వాయిదా
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీరుపై ఆగ్రహం

గాంధారి, మార్చి 31: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం గంటల తరబటడి వేచిఉన్న అనంతరం ఆపరేషన్లు చేయడం లేదని వైద్యులు తెలపడంతో రోగుల వారి బంధువులు వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయమై గత వారం పది రోజుల నుండి ఆయా గ్రామాల ఎఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది గ్రామాల్లోని మహిళలకు తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నుండే అనేక మంది ప్రభుత్వ ఆసుపత్రికి ఆపరేషన్ల నిమిత్తం తరలివచ్చారు. ఉదయం 10 గంటల వరకల్లా దాదాపు 30 మంది రోగులు వారి పేర్లను నమోదు చేయించుకున్నారు. వారందరికీ వైద్యశాలలో రక్త పరీక్షలు సైతం చేశారు. దీంతో అంతా సిద్ధమైందనుకున్న సమయంలో రోగుల బంధువులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వాయిదా పడ్డాయని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయిన రోగుల బంధువులు వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో వైద్య సిబ్బందిపై దాడి చేసినంత పనిచేశారు. అనంతరం మండల వైద్యాధికారి వీరేందర్‌తో వారు వాగ్వివాదానికి దిగారు. తాము ఉదయం నుండి పిల్లాపాపలతో ఎండలో గంటల తరబడి వేచి చూస్తే చివరకు ఇలా ఆపరేషన్లు వాయిదా పడడం ఏమిటని ప్రశ్నించారు. మేం ఎండలో కూర్చుని ఉంటే మీరు ఫ్యాన్‌ల కింద చల్లగా ఎలా కూర్చుంటారని ఆసుపత్రిలో ఫ్యాన్లుకు విద్యుత్ సరఫరాను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, పిఓఎల్ అలవెన్స్‌లు లేకపోవడం మూలంగానే ఇలా జరిగిందని వైద్యాధికారి వీరేందర్ తెలిపారు. అనంతరం రోగులు వారి బంధువులు నిరాశతో వెనుదిరిగారు.