నిజామాబాద్

లేఆఫ్ ఎత్తివేయాలని కార్మికుల దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, ఏప్రిల్ 7: బోధన్ పట్టణంలోని నిజాండెక్కన్ సుగర్స్ కర్మాగారంలో లే ఆఫ్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలలో చక్కెర కర్మాగారం కార్మికులు రమేష్, నాగరాజు, నర్సింగ్‌లు కూర్చున్నారు. వీరికి సిపిఐఎంఎల్ న్యూ డెమొక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి మల్లేష్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్య లే ఆఫ్ నిర్ణయం తీసుకుని కార్మికులను రోడ్డు పాలు చేసిందన్నారు. మరోవైపు నిజాంసుగర్స్ కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమని ఎన్నికలకు ముందు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కెసీఆర్ నేడు ఈ కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయమై స్తబ్దంగా ఉండటంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. లేఆఫ్ ఎత్తివేస్తే కార్మికులకు చేతి నిండా కర్మాగారంలో పని ఉండే అవకాశం ఉంటుందని అలాగే వారికి ప్రతీ నెలా వేతనాలు వచ్చే అవకాశం ఉందన్నారు. యాజమాన్యం లే ఆఫ్‌ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలకు వామపక్ష పార్టీల నాయకులు గంగాధర్ అప్పా, వరదయ్య, గుమ్ముల గంగాధర్, దాల్‌మల్క పోశెట్టి, సుల్తాన్ సాయిలు, హన్మంత్‌రావ్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.