నిజామాబాద్

చెరువులకు పూర్వవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్మర్‌పల్లి, ఏప్రిల్ 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వస్తుందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం కమ్మర్‌పల్లి మండలంలోని అమీర్‌నగర్, చౌట్‌పల్లి గ్రామాల్లో రెండవ విడత మిషన్ కాకతీయ పనులను ఆయన ప్రారంభించారు. అమీర్‌నగర్ గ్రామంలోని ఎర్రకుంట ఊర చెరువుకు 18.40 లక్షలు మంజూరయ్యాయని అన్నారు. చౌట్‌పల్లిలోని లక్ష్మాపూర్ పల్లె చెరువుకు 11.40 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. గతంలో సమైక్య పాలనలో తెలంగాణలోని చెరువులన్నీ నిరాదరణకు గురయ్యాయని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చెరువులను బాగు చేయడానికి మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పనులను కేంద్ర మంత్రి ప్రశంసించడంతో పాటు అనేక రాష్ట్రాల వారు మిషన్ కాకతీయను ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఆయన చెప్పారు. మిషన్ కాకతీయ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్లకు సూచించారు. చెరువుల్లో పూడికతీత పనులు కొనసాగుతున్నప్పుడు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మాలవత్ కౌసల్య, జడ్పీటిసి దాసరి లక్ష్మీ, చౌట్‌పల్లి సర్పంచ్ అల్లకొండ రాజన్న, అమీర్‌నగర్ సర్పంచ్ గంగు, ఎంపిటిసి అల్లకొండ దేవన్న, టిఆర్‌ఎస్ బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ యాదవ్, పార్వతి, శ్రీనివాస్, స్వామి, వేముల శ్రీనివాస్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.