నిజామాబాద్

2099 నాటికి పెరగనున్న భూతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూన్ 5: 2099నాటికి భూతాపం పెరిగితే మానవ మనుగడకే ప్రమాదం అని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, 2099 నాటికి భూతాపం 6 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఉపద్రవం నుండి ప్రపంచాన్ని కాపాడాలంటే ఉష్ణొగ్రత రెండు డిగ్రీల సెంటిగ్రేడ్‌లకు మించకుండా గట్టి చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని అన్నారు. ప్రకృతి పరిరక్షించడానికి నిర్ధిష్ట పరిమితులు విధించుకుని ప్రవర్తించడం అంత్యంత అవశ్యం అని అన్నారు. చిప్‌కో వంటి పర్యావరణ ఉద్యమాల స్ఫూర్తి ప్రభుత్వ కార్యాచరణలో ప్రతి ఫలించాలని పేర్కొన్నారు. నెలతల్లిని కాపాడుకోవడంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాల్సిన కీలక తరుణం ఇది అని అన్నారు. జిల్లాలోని అధికారులు అందరు తమ తమ శక్తి కొలది మొక్కలను నాటి పోషించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి శాఖ ద్వారా మొక్కలు నాటే లక్ష్యాన్ని కలెక్టర్ నిర్ణయించారు. సమావేశంలో కొత్తగా జిల్లాకు బదిలీపై వచ్చిన ఆర్‌అండ్‌బి ఎగ్జిక్వీటివ్ ఇంజనీర్ కుమారి జ్యోతిని అధికారులకు పరిచయం చేశారు. ఈ సమావేశంలో జిల్లా, డివిజన్ స్థాయి ఆర్‌అండ్‌బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని నిరసన
ఆర్మూర్, జూన్ 5: ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో వివిధ మండలాల ఉపాధ్యాయులు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని నిరసన చేపట్టారు. పాఠశాల ఆవరణలో మానవహారం నిర్వహించి కోర్సు డైరెక్టర్, ఎంఇఓ రాజగంగారాంకు వినతిపత్రం అందజేశారు. సిపిఎస్ విధానంలో ఉద్యోకి గ్రాట్యూటి, పెన్షన్ ఇతర సౌకర్యాలు ఉండవని అన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. 1-9-2004 తర్వాత నియామకం అయిన ఉపాధ్యాయ, ఉద్యోగులకు సిపిఎస్ విధానం వర్తిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, మోర్తాడ్, ఏర్గట్ల, ముప్కాల్, జక్రాన్‌పల్లి, మెండోరా, కమ్మర్‌పల్లి, వేల్పూర్ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.