నిజామాబాద్

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్ రూరల్, ఏప్రిల్ 7:ప్రభుత్వాసుపత్రులలోనే గర్భిణిల ప్రసవాలు జరుగాలని జిల్లా ఇన్‌చార్జీ వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట్ అన్నారు. గురువారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం నందు జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో అన్నిరకాల వసతులు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన గర్భిణిలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా వారు ప్రభుత్వాసుపత్రులకు వచ్చేలా మండలాల వారీగా ఉన్నటువంటి వైద్యారోగ్య శాఖాధికారులు కృషి చేయాలన్నారు. గర్భిణిల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ఈ విషయాన్ని గర్భిణిలు గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలో ప్రసవాల కోసం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. బాన్సువాడ, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్ ఏరియా ఆసుపత్రులలో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఆసుపత్రుల యందు మార్పు డెస్క్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇళ్ల వద్ద ఎవ్వరూ కాన్పులు చేయవద్దని ఆయన సూచించారు. మాతాశిశు మరణాలు పూర్తిగా తగ్గించాలన్నారు. ప్రతీ గ్రామంలోని ఏఎన్‌ఎంలు ప్రతీ నెలా ప్రభుత్వాసుపత్రులలో ఎనిమిది కాన్పులు చేయించేలా కృషి చేయాలన్నారు. 30 నుండి 60 ఏళ్ల లోపు మహిళలకు గర్భాశయ, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలన్నారు.