నిజామాబాద్

కూలీల కొరతతో వరి నాట్ల కోసం అపసోపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, డిసెంబర్ 6: ప్రస్తుత యాసంగిలో పంటల సాగు కోసం రైతులు అన్ని విధాలుగా సన్నద్ధమైన తరుణంలో కూలీల కొరత నెలకొనడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఈసారి ఆశించిన రీతిలో వర్షాలు కురియనప్పటికీ, నిజాంసాగర్‌తో పాటు గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీంతో జిల్లాలోని చివరి ఆ యకట్టు ప్రాంత రైతులు కూడా వరి పంట సాగు వైపే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. వర్ని, రుద్రూర్ ప్రాంతాల రైతులైతే ముందస్తుగానే పంటలు విత్తడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి రైతులకు నెల రోజుల ముందే పంట దిగుబడులు చేతికందుతాయి. యాసంగికి సంబంధించి డిసెంబర్ మొదటి వారం లోపే దాదాపు 70శాతం మంది రైతులు వరి నాట్లను పూర్తి చేసుకుంటారు. ఇప్పటికే దుక్కులు దున్ని, నారుమళ్లు సిద్ధం చేసుకున్న మిగతా రైతులు వరి నాట్లు వేసేందుకు అపసోపాలు పడుతున్నారు. ఒక ఎకరం విస్తీర్ణంలో ఒక రోజులో వరినాట్లు పూర్తి కావాలంటే దాదాపు 12మంది మహిళా కూలీల అవసరం పడుతుంది. వీరికి అదనంగా వరినారు అందించేందుకు మరో ఇద్దరు పురుష కూలీలు సహాయపడుతుంటారు. ఈ లెక్కన పెద్ద మొత్తంలో కూలీల అవసరం ఏర్పడగా, సేద్యపు పనులు చేపట్టేందుకు అనేక మంది ఆసక్తి కనబర్చడం లేదు. వ్యవసాయ కూలీలు గ్రామాల్లో ఉన్నప్పటికీ, ప్రస్తుతం వారంతా జాబ్‌కార్డులు పొంది ఉపాధి హామీ పథకం పనులపైనే దృష్టిని కేంద్రీకరిస్తుండడంతో వ్యవసాయ పనులకు కూలీల కొరత తలెత్తుతోంది. సునాయాసమైన పనులకు కూలీరేట్లు మంచిగానే గిట్టుబాటు అవుతుండడంతో మెజార్టీ కూలీలు ఉపాధి హా మీ పనులపైనే ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో రైతులు తమ పంట పొలాల్లో పనుల కోసం కూలీలకు మరింత ఎక్కువ రేట్లు చెల్లించాల్సి వస్తోంది. పరిస్థితిని గమనించిన మరికొందరు కూలీలు వ్యవసాయ పనుల కోసం పెద్ద మొత్తంలో కూలీ రేట్లను డిమాండ్ చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే కూలీలకు రవాణా వసతిని సైతం రైతులే సమకూర్చాల్సి వస్తోంది. సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. కూలీల డిమాండ్‌కు తగ్గట్టు వారికి వేతనాలు చెల్లించే స్థోమత లేక కొందరు తమ కుటుంబీకులతోనే వ్యవసాయ పనులు సాగించుకుంటున్నారు. ప్రతిరోజు మహిళా కూలీకి 300నుండి 350 రూపాయలు, పురుషులకు 400 రూపాయలు వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కూలీలు దొరికే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. కూలీ రేట్లకు తోడు కల్లు సీసాకు అదనంగా డబ్బులు, ఇతరత్రా సౌకర్యాలు సమకూర్చాల్సి వస్తోందని, అయినప్పటికీ కూలీలు అందుబాటులో ఉం డడం లేదని పేర్కొంటున్నారు. చిన్న, సన్నకారు రైతులు తమ కుటుంబీకులతో కలిసి వ్యవసాయ పనులను చేసుకుంటుండగా, పదెకరాలకు మించి భూములు కలిగిన రైతులు మాత్రం గత్యంతరం లేని పరిస్థితుల్లో యంత్రాలను నమ్ముకోవాల్సి (మిగతా 3వ పేజీలో)వస్తోంది. గంటల లెక్క చొప్పున ఈ యంత్రాలకు వందలాది రూపాయలు చెల్లించాల్సి వస్తుండడంతో వారు సైతం సతమతం అవుతున్నారు. ఎంతగా యంత్రాలతో పనులు చేసినా, కూలీలు చేసిన విధంగా సంతృప్తికరంగా ఉండవని, అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో యంత్రాలను నమ్ముకుని చేతి చమురును వదిలించుకోవాల్సి వస్తోందని బడా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా బ్లాక్ డే
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లాలో పలు ముస్లిం సంఘాలు చేపట్టిన బ్లాక్‌డే ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలైన రెంజల్, నవీపేట తదితర చోట్ల రెండు రోజుల ముందు నుండే ఇరువర్గాలకు చెందిన మత పెద్దలతో సమావేశాలు నిర్వహించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని, సామరస్యతను కాపాడాలని పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. బ్లాక్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మైనార్టీ నాయకులతో పాటు ముస్లిం మత పెద్దలు వేర్వేరుగా కలెక్టరేట్‌కు తరలివచ్చి ఇన్‌చార్జి కలెక్టర్ ఏ.రవీందర్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. డిప్యూటీ మేయర్ ఎంఎ.్ఫహీమ్ నేతృత్వంలో ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నెహ్రూపార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చి కొద్దిసేపు ధర్నా చేశారు. తెరాస మైనార్టీ సెల్ నాయకులు నవీద్‌ఇక్బాల్, తారిక్ అన్సారీ తదితరులు సైతం కలెక్టరేట్‌కు చేరుకుని మెమోరాండం సమర్పించగా, ముస్లిం పర్సనల్ లా జిల్లా అధ్యక్షుడు వౌలానా వలీఉల్లాఖాస్మీ, షౌకత్‌అలీ, సీనియర్ సిటిజన్ ఫోరం తరఫున అహ్మద్ నేతృత్వంలో ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి విజ్ఞాపనలు అందజేశారు. గత 25సంవత్సరాల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనతో కోట్లాది మంది ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతిన్నాయని ముస్లిం పెద్దలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ మతోన్మాద శక్తులు అనేక చోట్ల ముస్లిం మైనార్టీలపై దాడులకు తెగబడుతూ, వివక్షకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూల్చివేతకు గు రైన చోటనే బాబ్రీ మసీదును పునర్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా, బ్లాక్ డేను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ముస్లిం మైనార్టీ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అహ్మదీబజార్, నెహ్రూపార్క్, గాంధీచౌక్, బడాబజార్, అర్సపల్లి, మాలపల్లి, ఖిల్లా తదితర ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలను మూసి ఉంచి నిరసన చాటారు. కూ రగాయల దుకాణాలు, మటన్ మార్కెట్‌లు కూ డా బంద్ ఉంచారు. యువకులు నల్ల జెండాలు చేతబట్టుకుని నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగించారు. జిల్లా కేంద్రంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ జరిపారు. కాగా, నందిపేట మండల కేంద్రంలో ఓ యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. త మ మనోభావాలను దెబ్బతీసే రీతిలో పోస్టింగ్ ఉందంటూ ముస్లిం మైనార్టీలు మండిపడ్డారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎంఐఎం నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయను సంప్రదించి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగ్ పెట్టిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే సదరు యువకుడిపై కేసు నమోదు చేశామని, ఆర్మూర్ ఏసీపీ దర్యాప్తు జరుపుతున్నారని సీ.పీ పేర్కొనడంతో శాంతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నందిపేటలో పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు.

నేడు తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలు

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, డిసెంబర్ 6: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గత వారం రోజుల నుండి నిర్వహిస్తున్న ఉత్సవాలు గురువారం నాటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని కూడా అట్టహాసంగా జరపాలని జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం వివిధ శాఖల అధికారులతో ఇన్‌చార్జి కలెక్టర్ ఏ.రవీందర్‌రెడ్డి తన చాంబర్‌లో స మావేశమై, ముగింపు ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి మించి వీడ్కోలు సంబరం ఉండేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మైదానం నుండి గాంధీచౌక్ మీదుగా కళాకారులు, విద్యార్థిని, విద్యార్థులు, అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు, సాహితీవేత్తలతో భారీ ర్యాలీ నిర్వహించాలన్నారు. ఆయా శాఖల నుండి ఎంతమంది అధికారులు, ఉద్యోగులు పాల్గొంటారన్నది చర్చించి, శాఖాధిపతులకు లక్ష్యాలను నిర్దేశించారు. కనీసం 1500మందికి పైగా ప్రదర్శనలో పాల్గొనేలా చూడాలని ఇన్‌చార్జి కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా ర్యాలీలో పాల్గొనాలని ఆదేశించారు. ఈ ముగింపు వేడుకల్లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవితతో పాటు జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, (మిగతా 3వ పేజీలో)నగర మేయర్ ఆకుల సుజాత, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ హాజరుకానున్న దృష్ట్యా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ముగింపు వేడుక కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించుకుని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటేలా సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలతో మహాసభలకు వీడ్కోలు పలుకుతామని ఇన్‌చార్జ్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వారిని ఈ సందర్భంగా సన్మానించడం జరుగుతుందని అన్నారు. పాఠశాలలు, కళాశాలలు, పీ.జీ స్థాయిలలో విద్యార్థిని, విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు బహూకరించాలని సూచించారు. ముగింపు సభలో ముఖ్య అతిథుల ప్రసంగాల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ వినోద్‌కుమార్, డీఐఈఓ డీ.ఒడ్డెన్న, ఏసీపీ ఎం.సుదర్శన్, డీఈఓ నాంపల్లి రాజేష్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.