నిజామాబాద్

ఉపాధి హామీ కూలీల వేతనాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 11: గడిచిన మూడు మాసాల నుండి వేతనాల కోసం ఎదురుతెన్నులు చూస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలకు కూలీల వేతన బకాయిలను ప్రభుత్వం మంజూరు చేస్తూ పోస్ట్ఫాసులలో జమ చేసింది. మొత్తం 81కోట్ల రూపాయలను విడుదల చేయగా, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 5.57కోట్లు, కామారెడ్డి జిల్లాకు 6.17కోట్ల రూపాయల బకాయిలు మంజూరయ్యాయి. అయితే ప్రభుత్వం ప్రస్తుతం మంజూరు చేసిన దానికంటే దాదాపు మూడింతలకు పైగా వేతన బకాయిలు ఇంకనూ రావాల్సి ఉందని తెలుస్తోంది. కొంతమేరకైనా బకాయిలు విడుదల చేయడంతో ఉపాధి హామీ కూలీలు ఆర్థిక వెతల నుండి తాత్కాలికంగా కొన్నాళ్ల పాటైనా ఉపశమనం పొందనున్నారు. గడిచిన మూడు మాసాల నుండి వారికి వేతనాలను చెల్లించకపోవడంతో అర్ధాకలితో కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. దసరా, దీపావళి వంటి పండుగ వేళల్లోనూ వేతనాలు చేతికందకపోవడంతో ఈ వేడుకలను కూడా ఆనందోత్సాహాల నడుమ నిర్వహించుకోలేని దైన్య స్థితిలో కొట్టుమిట్టాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ఉపాధి హామీ కూలీలకు సుమారు 47కోట్ల రూపాయల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉండగా, పై నుండి నిధులు మంజూరు కావడం లేదంటూ అధికారులు నిస్సహాయతను వెలిబుచ్చుతూ వచ్చారు. ఈ విషయమై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ సభ్యులు ఉపాధి కూలీల వేతన బకాయిలను ప్రస్తావిస్తూ అధికారులను నిలదీయడం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి పోచారం స్పందిస్తూ, పలు కారణాల వల్ల వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరగడం వాస్తవమేనని, త్వరలోనే బకాయిలు విడుదలవుతాయని పేర్కొనడం జరిగింది. విదేశాల్లో బతుకమ్మ సంబరాలు ముగించుకుని వచ్చిన మీదట బాల్కొండ మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలోనూ నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితతో ఉపాధి హామీ కూలీలు మొర పెట్టుకున్నారు. మూడు మాసాలుగా వేతనాలు అందించడం లేదని, ఫలితంగా తమ కుటుంబాలు పస్తులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలకు సంబంధించి రెండున్నర లక్షల పైచిలుకు మంది ఉపాధి హామీ కూలీలకు 47కోట్ల రూపాయల పైచిలుకు నిధులను వేతనాల రూపంలో పంపిణీ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం తాజాగా ఉమ్మడి జిల్లాకు 12కోట్ల రూపాయల వరకే బకాయి నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే ఈ నిధులను పోస్ట్ఫాసుల్లో జమ చేయడం జరిగిందని, ఉపాధి హామీ కూలీలు సంబంధిత పోస్ట్ఫాసులకు వెళ్లి వేతనాలు పొందవచ్చని డీఆర్‌డీఏ పీ.డీ వెంకటేశ్వర్లు తెలిపారు.

రైతుల అభ్యున్నతికి కృషి
*మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నిజాంసాగర్, డిసెంబర్ 11: రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతి కోసం సీఏం కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్‌గ్రామ శివారులోగల బేడీల మైసమ్మ ఆలయం వద్ద, జెడ్పీ చైర్మన దఫేదార్ రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలతో కలిస మంత్రి విలేఖరులతోమాట్లాడారు. భారత దేశంలో అధికారులకు విదేశాలకు పంపించిన దాఖలాలు లేవన్నారు. ఇజ్రాయిల్ దేశంలోని వ్యవసాయ రంగాన్ని అధ్యయనం చేసేందుకు, 1250 మంది వ్యవసాయశాఖాధికారులను పంపించడం జరుగుతుందన్నారు. ఇజ్రాయిల్ దేశం ప్రపంచంలోనే వ్యవసాయరంగంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రజలందరు వాడిన నీటిని శుద్ధి చేసి, వ్యవసాయ రంగానికి నీటిని పంటల సాగుకోసం వినియోగించుకోవడం జరుగుతోందని, అదే తరహాలోతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తక్కువ నీటితోపంటలు సాగుచేయడం, తక్కువ పెట్టుబడితోసాగుచేసే విధానం గురించి అధ్యయనం చేసేందుకు అధికారులకు విదేశీ పర్యటనకు పంపించడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని చెరకు కర్మాగారాలు, ఉన్న ప్రాంతంలోవిడతల వారీగా, చెరకు నరికే యంత్రాలను, హార్వేస్టర్ల కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుందన్నారు. పాలీ హౌస్ పథకం కింద లబ్ధిదారులకు 75శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో వ్యవసాయ రంగాన్ని దండుగ అన్నారు. కాని తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగగా చేసుకునేందుకు కృషి చేస్తుందన్నారు. రైతులందరు ఆత్మగౌరవంగా బతికేందుకోసం, సీఏం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నారన్నారు. ఈవిలేఖరుల సమావేశంలో సీడీసీ చైర్మైన్ పట్లోళ్ల దుర్గరెడ్డి, సర్పంచ్ పట్లోళ్ల లక్ష్మీ, మండల కో-ఆఫ్షన్ సభ్యులు అహ్మద్ హుసెన్,సర్పంచ్ రాజు, టీఆర్‌ఎస్ మండల నాయకులు వినయ్‌కుమార్, గంగారెడ్డి, గైని విఠల్ తదితరులు పాల్గొన్నారు.