నిజామాబాద్

ఘనంగా మల్లన్న ఉత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డిరూరల్, డిసెంబర్ 11: దేవున్‌పల్లి గ్రామంలో సోమవారం మల్లన్న ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. డప్పులు, దరువుల నడుమ వేదపండితులు గొల్లకేతమ్మ, మేడాలమ్మల కల్యాణమహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా స్వామి వారికి సర్పంచ్ నిట్టువెంకట్‌రావు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరము భక్తులు స్వామి వారికి కట్నకానుకలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఏర్పాటు చేసిన అగ్నిగుండాల నుండి యువతి యువకులు, వీరశైవులు, దాదాపు వంద మంది ఎర్రగా ఉన్న నిప్పు కణాలపై నుండి నడుచుకుంటూ వెళ్లి మొక్కుల తీర్చుకున్నారు. ఐదు సార్లు అటూ ఇటూ వారు అగ్నిగుండాల్లో నడుస్తుంటే, ఓం నమశివయ, ఓం నమశివయా, ఓం ఓం మల్లన్న అంటూ నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో పండితులు హిత బోధ చేశారు. ఈకార్యక్రమంలో ఎంపిపి లద్దురి మంగమ్మలక్ష్మీపతియాదవ్, సర్పంచ్ నిట్టువేణుగోపాల్‌రావు, ఉపసర్పంచ్ నగల్లరాజేందర్, వైస్ ఎంపీపీ పోలీస్ శ్రీకృష్ణాజీరావు, గ్రామాభివృద్ది కమిటీ చైర్మెన్ రవీందర్, కమిటీ సభ్యులు బాలస్వామి, మల్లేశ్, సోమవేశ్వర్‌రావు, బోగిరవీ, మిద్దెల సాయులు, దేవల శ్రీనివాస్, రాజేందర్, సిద్దిరాములు, మల్లేశ్, నారాయణ, గంగాధర్, నర్సింలు, రాములు, భూదయ్య, రాజయ్య, రాజుపాటల్, మహిజస్వామి, మర్కంటి స్వామి తదితరులు పాల్గొన్నారు.