నిజామాబాద్

మిషన్ భగీరథ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్మర్‌పల్లి, డిసెంబర్ 12: రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం 42 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం కమ్మర్‌పల్లిలో స్థానిక మున్నూరు కాపు సంఘం సభ్యులు, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాలకు చెందిన మోచి సంఘం సభ్యులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహుల వద్ద లేకపోవడం వల్లే ఈ రోజు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో 42 వేల కోట్లతో చేపడుతున్న మిషన్ భగీరథ ప్రాజెక్టుకు వైస్ చైర్మన్ కాగలిగానని అన్నారు. నియోజకవర్గంలో 11 విద్యుత్ సబ్ స్టేషన్లు, వాగులపై చెక్ డ్యాంలు, 142 కోట్లతో రోడ్లు మంజూరు చేయించగలిగానని అన్నారు. సీఎం కేసీఆర్‌కు దగ్గరగా ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమైనట్లు చెప్పారు. అనంతరం ఆయన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ స్వామిరెడ్డి, ఎంపీపి కౌసల్య, జడ్పీటిసి లక్ష్మీ, సొసైటీ చైర్మన్ బద్ధం భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు మైథిలీ, భూమాయి, గోపి, రాజన్న, జమున, అంజమ్మ, గంగు, హంసీ, శంకర్‌నాయక్, ఎంపిటీసీ రాజన్న, నాయకులు రేగుంట దేవేందర్, లక్ష్మారెడ్డి, భాస్కర్ యాదవ్, లుక్క గంగాధర్, చిన్నారెడ్డి, ఏనుగు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొత్త జిల్లాలో మహిళల పట్ల పెరిగిన వివక్ష
* ఏఐఎఫ్‌డీడబ్ల్యూ అధ్యక్షురాలు లీల

కామారెడ్డిరూరల్, డిసెంబర్ 12: కొత్తగా ఏర్పాటు అయిన జిల్లాలో మహిళలపై వివక్ష పెరిగిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సమాఖ్య సంఘం(ఏఐఎఫ్‌డీడబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలు లీల అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి కార్యకర్తలు సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ఎస్పీ, డిఎస్పీలు ఇద్దరు కూడా మహిళలు ఉన్నప్పటికీ, మహిళా పోలీసుస్టేషన్‌ల ఏర్పాటు పట్ల నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. జిల్లాలో అనేక చోట్ల మహిళలపై అఘాయిత్యాలు జరగడం మహిళలను అంగడి సరుకుగా మార్చి గ్రామాల్లో మహిళలను డబ్బుతో కొని మహిళల హక్కులు కాలరాసే చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జిల్లాలో ప్రభుత్వమే పరోక్షంగా గ్రామాల్లో బెల్టుషాపులు నడిపిస్తుందని ఆరోపించారు. ఒక వేళ ప్రభుత్వం పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని నడపకుంటే వెంటనే బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపేదని అన్నారు. ప్రభుత్వం బెల్టుషాపులను చూస్తూ ఊరుకుంటుందంటే దాని అర్థం ఏమిటో అందరికి తెలుస్తుందని అన్నారు. మధ్యపానం వల్ల గ్రామాల్లో అనేక మంది జీవితాలు చిద్రం అవుతున్నాయని, ముఖ్యంగా మధ్యానికి భానిసై చాలా మంది తమ భార్యల పుస్తేల తాళ్లు అమ్ముకునే దౌర్భగ్యం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కల్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళ హక్కులపై, పోరాటం చేస్తూ సమాజికంగా మహిళలు స్వేచ్చగా బ్రతికేందుకు ఉద్యమం చేస్తామని అన్నారు. ఈజిల్లా స్థాయి సమావేశంలో ప్రతినిధులు షాహిన్, రజియా, భాగ్య, వరలక్ష్మీ, లక్ష్మీ, రాజమణి, ఖాజాబీ, ఖాసీంబీ, బుచ్చవ్వ, నర్సవ్వ పాల్గొన్నారు.