నిజామాబాద్

బీడీ కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, డిసెంబర్ 12: బీడికార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే బీడీ కార్మికులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేయాలంటూ డిమాండ్ చేస్తూ, బీడీకార్మికులు మంగళవారం కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తెలంగాణ బీడీ రోలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులక్ష్మణ్ మాట్లాడుతూ, వెయ్యి బీడిలకు సరిపడా నాణ్యమైన తూనికి ఆకుల సరఫరా చేయాలని, శనివారం చేయించుకున్న బీడీకి పిఎఫ్ కట్టాలని మునీంలను బెదిరించి బ్రాంచి బ్రాంచికి వాడే ఆకును కంపెనీ తీసుకోకుండా కార్మికులకు అందించాలని, టేకేదార్ల నుండి కూడా దౌర్జన్యంగా తీసుకుని ఆకును బంద్ చేయాలని, బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇంటిని కట్టుకోవడానికి లక్ష యాభైవేల రూపాయల లోన్ మంజూరు చేయాలని, ఇండ్లులేని నిరుపేద బీడీకార్మికులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ఆర్డీఓ శ్రీనుకు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం ప్రతినిధులు పర్వవ్వ, మల్లేశం, కోటయ్య, చాట్ల సిద్దయ్య, రమేష్, బి.రాములు, రవీందర్, అంకం కిషన్‌తో పాటు బీడీ కార్మికులు పాల్గొన్నారు.

కంటి ఆసుపత్రి ప్రారంభం
కంఠేశ్వర్, డిసెంబర్ 12: జిల్లా కేంద్రంలోని మారుతినగర్‌లో స్నేహా సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన ఛారిటీ కంటి ఆసుపత్రిని మంగళవారం ఇన్‌చార్జి కలెక్టర్ ఏ.రవీందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్నేహా సొసైటీ ద్వారా దివ్యాంగులకు ఇప్పటికే అనేక రకాల సేవలందిస్తున్నారని, ప్రస్తుతం కంటి ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కంటి జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు ప్రభుత్వపరంగా కూడా వైద్య చికిత్సలు అందిస్తూ, ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ఈ తరహా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ, వైద్య సేవలను మరింతగా మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతోందన్నారు. స్నేహా సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ, అవయవ లోపంతో బాధపడుతున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో రిసోర్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కేంద్రంలో ఆసక్తి గల వారికి వివిధ రంగాల్లో శిక్షణ అందించి నిష్ణాతులుగా తయారు చేయడం జరుగుతుందన్నారు. కంటి ఆసుపత్రిలో యుద్ధ ప్రాతిపదికన మరిన్ని సౌకర్యాలను కల్పిస్తూ, ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కోఆర్డినేటర్ సురక్షిత్‌రెడ్డి, స్నేహా సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి పాల్గొన్నారు.