నిజామాబాద్

బస్టాండ్ ప్రమాద స్థలం పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జనవరి 2: కామారెడ్డి జిల్లాకేంద్రంలోని టిఆర్టీసి బస్‌స్టాండ్‌లో సోమవారం రాత్రి షార్ట్‌సర్య్కుట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి సెల్‌దుకాణంతో పాటు పండ్ల దుకాణాలు, మోటర్ సైకిళ్లపార్కింగ్‌లోని వాహనాలు దగ్ధం అయి లక్షలాది రూపాయల ఆస్తినష్టం జరిగిని విషయం పాఠకులకు విధితమే. ఈ సంఘటన సమాచారం తెల్సుకున్న ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ మంగళవారం ఉదయం హైదరాబాద్ నుండి కామారెడ్డికి చేరుకుని, ఆర్టీసి అధికారులతో కలిసి ప్రమాదం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాల తెలుకున్నారు. దగ్దం అయిన వాహనాలను, దుకాణాలన పరిశీలించిన విప్, బస్‌స్టాండ్ ఆవరణలోని పండ్ల దుకాణాల యాజమానులతో ఈ సంఘటనకు సంబందించి పలు విషయాలను అడిగి తెల్సుకున్నారు. ఈ ప్రమాదానికి సంబందించి నివేదిక తయారు చేయాల్సిందిగా టిఆర్టీసి అధికారులను విప్ ఆదేశించారు. ఆర్థికంగా నష్టపోయిన వారికి న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానిన ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, అన్నారు. దగ్ధం అయిన వాహనాలకు ఇన్సూరెన్స్ తదితర పత్రాలు ఉన్నాయా లేదా పరిశీలించాలని, ఉంటే వారికి వెంటనే ఇన్సూరెన్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో నష్టపోయిన బాధితులు తమకు న్యాయం జరిగేలా చూడాలని విప్‌కు వేడుకున్నారు. ప్రభుత్వ విప్‌తో పాటు కామారెడ్డి డిపో మేనెజర్, ఇతర శాఖల అధికారులు టిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
కలెక్టర్‌కు శుభాకాంక్షలు

కామారెడ్డి, జనవరి 2: నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం కామారెడ్డి కలెక్టర్‌డాక్టర్. సత్యనారాయణతో పాటు జాయింట్ కలెక్టర్ సత్తయ్యలను కామారెడ్డి జిల్లా పౌరసంబంధాల అధికారిణి (డిపిఆర్‌ఓ) ఎం.పద్మ, సహాయ పౌరసంబంధాల అధికారి పి.వెంకటేశ్వర్‌రావులు కలుసుకుని పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వాధికారులు చేస్తున్న పనులకు సంబందించిన సమాచారాన్ని ప్రజలకు అందించే విధంగా పాత్రికేయులకు సకాలంలో సమాచారం అందిస్తూ, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్, జేసీలు కూడా డిపిర్‌ఓ సహాయ డిపిఆర్‌ఓలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.