నిజామాబాద్

అభ్యర్థుల సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, జనవరి 2: డివిజన్ కేం ద్రంలోని స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, గాంధారి మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఖాళీల భర్తీకోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థుల ఓరిజినల్ సర్ట్ఫికేట్‌ల పరిశీలన మంగళవారం ప్రారంభించినట్లు ఐసిడిఎస్ సిడిపిఓ సునంద తెలిపారు. ఈసందర్భంగా సిడిపిఓ విలేఖరులతోమాట్లాడుతూ డిసెంబర్ 21 నుంచి 30వరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించడం జరిగిందన్నారు. మొత్తం అంగన్‌వాడి మేయిన్ టీచర్లు 13, ఆయాలు 15, మినీ టీచర్లు 4 పో స్టులకు గాను, ఆన్‌లైన్‌లో 386 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఆమె తెలిపారు. మంగళవారం ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల నుంచి దరఖాస్తులు చేసుకున్న మహిళా అభ్యర్థుల ఒరిజినల్స్ సర్ట్ఫికెట్స్‌లను పరిశీలించడం జరిగిందన్నా రు. గురువారం లింగంపేట్, గాంధారి మండలాల అభ్యర్థుల సర్ట్ఫికెట్స్‌లను పరిశీలించనున్నట్లు ఆమె తెలిపారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని 4 అం గన్‌వాడీ టీచర్ పోస్టులకు గాను 171 మంది మహిళా అభ్యర్థులు అత్యథికంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నట్లు సిడిపిఓ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న మహిళా అభ్యర్థుల ఓరిజినల్స్‌సర్ట్ఫికేట్స్ వేరిఫికేషన్ చేసి జాబితాను సిద్దం చేసి ఆన్‌లైన్‌లో కలెక్టర్ సత్యనారాయణ పరిశీలన కోసం పంపించడం జరుగుతోందన్నా రు. నియామకాలన్ని కూడా మెరిట్ ప్ర కారం జరుగుతాయని ఈసందర్భంగా సిడిపిఓ సునంద తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మైపాల్‌రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ నర్సింలు , తదితరులు ఉన్నారు. ఒరిజినల్స్ దరఖాస్తుల పరిశీలన కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకున్న మహిళలు తమ చిన్నారులతో రావడంతో వారి కోసం టెంట్‌ను ఏర్పాటు చేయడంతో కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు ఓపిగ్గా కూర్చున్నారు.