నిజామాబాద్

అయ్యప్పకు ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, జనవరి 2: రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మంగళవారం కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వేడుకున్నారు. వారు ఫోన్‌లో శబరిమల నుంచి విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర సీఏం కేసీఆర్ ఆయురారోగ్యాలతోఉం డి, రాష్ట్రాన్ని అబివృద్ధి పథంలో ప్రయాణించే దిశగా, మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే శక్తిని ప్రసాదించాలని వేడుకున్నామన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే స్వామి వారిని ఇప్పటి వరకు 12వ సార్లు, ఉమ్మడి జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు స్వామి వారిని 6వ సారి దర్శనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం జరుగుతోందన్నారు. వారివెంట మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయగౌడ్, పిట్లం ఎంపీపీ రజనీకాంత్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సురేష్‌గౌడ్, తదితరులు ఉన్నారు.
పాఠశాలల్లో గోరుముద్ద ప్రారంభం
ఇందూర్, జనవరి 2: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్ ఆదేశాల మేరకు ఎడపల్లి మండల కేంద్రంతో పాటు ఠాణాకలాన్, జానకంపేట్ గ్రామాల్లోని ఉన్నత పాఠశాలల్లో మంగళవారం గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున, ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పేద విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఇలాంటి వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలని ఆయా గ్రామాల ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్లు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి పాఠశాలలో హెచ్‌ఎం సాయిలు, ఎస్‌ఎంసీ చైర్మన్ శాంతి, సభ్యులు సుజాత, ఉపాధ్యాయులు, ఠాణాకలాన్‌లో హెచ్‌ఎం సుశీల్‌కుమార్, ఉపాధ్యాయులు, జానకంపేట్‌లో ఇన్‌చార్జి హెచ్‌ఎం లోల శంకర్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర జట్టుకు .. విద్యార్థి ఎంపిక
కమ్మర్‌పల్లి, జనవరి 2: కమ్మర్‌పల్లి మండలం కోనాసముందర్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని మాలావత్ అఖిల రాష్టస్థ్రాయి మహిళల ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే.మనోహర్ తెలిపారు. మంగళవారం పాఠశాల అసెంబ్లీ సమయంలో ప్రధానోపాధ్యాయుడు మనోహర్ మెమోంటోను అందజేసి అభినందించారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని నాగారాం స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అఖిలను నిర్వాహకులు రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ నెల 9నుండి 12వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్టస్థ్రాయి ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా జట్టుకు అఖిల ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ స్వప్న తెలిపారు. రాష్టస్థ్రాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఉపాధ్యాయ బృందం ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీచర్లు ప్రభాకర్, నీలా మహేశ్వర్, రమేష్, భూసాని విష్ణువర్దన్, విమల, అశ్విని, తదితరులు పాల్గొన్నారు.