నిజామాబాద్

టీఆర్‌ఎస్ మాటల ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి రూరల్, జనవరి 21: టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైన ప్రభుత్వం అని, చేతల ప్రభుత్వం కాదని శాసనమండలి ప్రతిపక్షనేత మహ్మద్ షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం మండలంలోని అడ్లూర్ గ్రామంలో కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ నిధుల నుండి 13లక్షలతో గ్రామంలోని రజక, గౌడ, ముదిరాజ్, మున్నూరుకాపు, రెడ్డి కుల సంఘాల భవనాల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఒక్కో సంఘ భవనానికి రెండు మూడు లక్షల రూపాయల వరకు మంజూరైనట్లు తెలిపారు. వీటిని పూర్తి చేయడానికి మరికొన్ని నిధులు అవసరమన్నారు. వీటిని అన్నింటినీ పూర్తి చేసే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కామారెడ్డి నియోజకవర్గంలో నా హాయంలోనే అధికంగా కుల సంఘాల కమ్యూనిటీ భవనాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నందున సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టడానికి అన్ని పధకాలను మాటల్లో చెబుతున్నాడు తప్ప అవి అమలు సాధ్యం కావన్నారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన పార్టీలకు చెందిన వార్డు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు, జడ్పీటీసీ నిమ్మ మోహన్‌రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, గ్రామాభివృద్ది కమీటీ అధ్యక్షుడు నర్సింలు, ఎంపీటీసీలు నిమ్మ విజయకుమార్‌రెడ్డి, కుమార్ గౌడ్, పర్స నర్సాగౌడ్, నాయకులు ఎడ్ల రాజిరెడ్డి, సంతోష్, తిరుపతి పాల్గొన్నారు.