నిజామాబాద్

నేడు అంగడిబజార్‌ను ప్రారంభించనున్న పోచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ రూరల్, జనవరి 21: ఎట్టకేలకు బాన్సువాడలో కొత్త వారపు సంతకు ముహూర్త కుదిరింది. వారపు సంతను మార్చేందుకు 40ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి కలిసొ చ్చాయ. వారపు సంతను ఏ విధంగానైనా మార్చాలన్నలక్ష్యంతో మంత్రి పోచారం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పట్టణంలోని ఎల్లయ్య చెరువుప్రాంతంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో అంగడిని ఏర్పాటుచేసేందుకు అఖిల పక్షాలు సుముఖతను వ్యక్తం చేశాయ. దాంతో సంత ఏర్పాటుకు అన్ని సమస్యలు తీరిపోయాయి. పక్షం రోజులు గా సంతకోసం పనులు చురుగ్గా కొనసాగాయి. పనులు పూర్తికావడంతోమంత్రి పోచారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రారంభోత్సవం చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. వారపుసంత ఏర్పాటులో భాగంగా కూరగాయలు, మాంసాహార దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపారులకు, వినియోగదారుల కోసం మూత్రశాలలు, తాగునీటి వసతిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు పట్టణంలోని వీక్లీ మార్కెట్ ప్రాంతంలో వారపుసంతను నిర్వహించేవారు. సంత స్థలం సరిపోక పుట్‌ఫాత్ వ్యాపారులు ప్రధాన రోడ్డుకిరువైపుల డేరాలను వేసుకొని వ్యాపారాలు చేసుకునేవారు. రోడ్డు ఇరుకుగా మారి అక్కడి నుండి వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. భారీ వాహనాలు ఆ దారి గుండా వెళ్లాలంటే ట్రాఫిక్ ఇక్కట్లు తప్పవికావు. పలు సందర్భాల్లో వారపు సంతకు వచ్చిన వారు రోడ్డు ప్రమాదాల పాలై ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలున్నాయి. వారపు సంత సమీపంలోనే పశువుల, మేకల సంతలను ఏర్పా టు చేయడంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ చక్రబంధంలో ఉండేది. వారపు సంతకు చుట్టుపక్కల ఉన్న ఎనిమిది మండలాలకు చెందిన ప్రజలు వస్తుంటారు. సుమారు 800 నుండి వెయ్యి వరకు పుట్‌ఫాత్ వ్యాపారులుంటారు. వేలాది మంది వినియోగదారులతో ప్రతి గురువారం ఈ ప్రాంతమంతా కిక్కిరిసి ఉంటుంది. ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నాలుగేళ్లనుండి ఎల్లయ్య చెరువు ప్రాంతంలో వారపు సంతను ఏర్పాటు చేసేందుకు పోచారం చేయని ప్రయత్నంలేదు. ఎట్టకేలకు వారపుసంత మారుతుండటంతో రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతోపాటు పట్టణవాసులకు సమీపంలో వారపుసంత ఏర్పాటు కానుంది. సంత ఏర్పాటుతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.