నిజామాబాద్

టీయును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, జనవరి 21: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో నెలకొల్పిన తెలంగాణ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తు ఆయన మార్గమధ్యంలో డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఓ హోటల్‌లో కాసేపు సేదతీరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. అంతకు ముందు డిచ్‌పల్లికి చేరుకున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణ పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.