నిజామాబాద్

నేరస్థులపై నిఘా నేత్రం ‘‘టిఎస్ కాప్’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, జనవరి 22: హైటెక్ వ్యూహాలతో దొంగతనాలు, ఇతర మేజర్ నేరాలకు పాల్పడే వారిపై పోలీసుల ‘టిఎస్‌కాప్’ నిఘా నేత్రంగా పనిచేయనుంది. ఈ యాప్ ద్వారా ఇక నుండి నేరాలకు పాల్పడిన వారు ఏ మాత్రం పోలీసుల నుండి తప్పించుకోలేరు. ఎక్కడైనా పాత నేరస్థుడు నేరానికి పాల్పడగానే వెంటనే టిఎస్ కాప్ ద్వారా ఫింగర్‌ప్రింట్‌ల ఆధారంగా నేరస్థుని వివరాలన్నీ పోలీసుల చేతికి చిక్కనున్నాయి. అంతేకాకుండా పాత నేరస్థుడి కదలికలు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. పాత నేరస్థుల వివరాల సేకరణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఈ యాప్‌ను రూపొందించారు. ఠాణాల వారీగా పాత నేరస్థుల వివరాలను సేకరిస్తున్న అధికారులు వారి నుండి ఫింగర్ ప్రింట్‌లను సేకరించి వారికి సంబంధించిన ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, ఒటరు గుర్తింపు కార్డు, వారు నివసిస్తున్న ఇళ్లకు సంబంధించిన కరెంటు బిల్లుల రశీదుల జిరాక్స్ కాపీలను సైతం సేకరించి వాటిని ఎప్పటి కప్పుడు యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ వివరాలన్ని యాప్ ద్వారా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్‌లకు అనుసంధానం చేయనున్నారు. దాంతో నేరస్థుల వివరాలు అన్ని ఠాణాలలో అందుబాటులోనికి రానున్నాయి. ఫ్రెండ్లీ పోలీసు అంటూ ప్రజలకు చేరువయ్యేందుకు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్న పోలీసు శాఖ గత ఐదు రోజుల క్రితం నేరస్థుల సమగ్ర సర్వే అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. బోధన్ పట్టణంతో పాటు బోధన్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో గత నాలుగు రోజులుగా పోలీసులు బృందాలుగా విడిపోయి గ్రామాలలో సర్వేలు చేస్తున్నారు. బోధన్ అర్బన్ ఠాణాలో మొత్తం పదేళ్ల నుండి ఇప్పటి వరకు మేజర్ దొంగతనాలు, నేరాలకు సంబంధించి 294 మంది నేరస్థులను అధికారులు గుర్తించారు. పోలీసు బృందాలకు వీరిచ్చిన అడ్రస్‌ల ప్రకారం వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. నేటి వరకు దాదాపు అరవై శాతం మంది సర్వే పూర్తయినట్లు అధికారులు తెలియచేస్తున్నారు. ఇదిలా ఉండగా రూరల్ ఠాణా పరిథిలో మొత్తం 73 మంది నేరస్థులను గుర్తించి వారి వివరాలు సేకరించారు. ఇందులో కొందరు స్థానికంగా లేకపోవడం, వారిచ్చిన అడ్రస్‌లలో నివాసాలు లేకపోవడంతో అధికారులు వారి వివరాల సేకరణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. బోధన్ ఏరియాలో ఎక్కువగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, హత్యలు, చీటింగ్ కేసులకు సంబంధించిన నేరస్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. అధికారులు వీరి వివరాలు సేకరిస్తూ వారికి సంబంధించి ఆధార్ కార్డుల జిరాక్స్‌లను సేకరించి ఆన్‌లైన్ చేస్తుండటంతో నేరస్థుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గతంలో మేజర్ నేరాలకు పాల్పడి జైలు జీవితం అనుభవించి విడుదలైన వారిపై అధికారులు కేవలం నిఘా ఉంచేవారు. కానీ నేడు వారి ఆధార్ కార్డులతో పాటు వారి రక్తసంబంధీకులకు సంబంధించిన ఆధార్ కార్డుల జిరాక్స్ పత్రాలు, ఓటరు గుర్తింపు కార్డుల జిరాక్స్ పత్రాలు సేకరిస్తుండటంతో మునుముందు నేరాలకు పాల్పడితే ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోనన్న భయం వారిని నీడలా వెంటాడుతోంది. ఈ నేరస్థుల వివరాల సేకరణ పలు గ్రామాలలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ నాడు లేని విధంగా ఇప్పుడు ఈ వివరాలు ఎందుకు సేకరిస్తున్నారో అంతుచిక్కడం లేదని గ్రామీణ ప్రజలు పేర్కొంటున్నారు. కేవలం నేరస్థుల వివరాలు మాత్రమే సేకరిస్తున్నామని అధికారులు తెలియచేస్తున్నా ఈ వివరాల సేకరణ నేరస్థులు తిరిగి నేరాలకు పాల్పడకుండా ఉండేలా చేస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యాప్ భవిష్యత్‌లో తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దొంగతనాలు జరిగితే ఫింగర్ ప్రింట్‌లు సేకరించి నేరస్థులను గుర్తించేందుకు అనేక అవస్థలు ఎదుర్కోవలసి వచ్చేదని కానీ నేడు యాప్‌లో అందరి వివరాలు అందుబాటులో ఉండటం వలన నేరస్థులను గుర్తించడం చాలా సునాయసమని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉన్నతాధికారులు ఈ యాప్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.