నిజామాబాద్

స్థానికంగానే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 22: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు హితవు పలికారు. దీనివల్ల ఫిర్యాదుదారులు అనవసర వ్యయ,ప్రయాసాలు కోర్చి జిల్లా కేంద్రానికి తరలిరావాల్సిన అవసరం ఉండదని అన్నారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, ప్రజావాణికి అందుతున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా గ్రామ, మండల స్థాయిలలో పరిష్కారం అయ్యే సమస్యలు కూడా ఉంటున్నాయని అన్నారు. దీనివల్ల జిల్లా అధికారుల సమయం వృధా అవడమే కాకుండా, ఫిర్యాదుదారులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూ జిల్లా కేంద్రానికి రావాల్సి వస్తోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇకపై క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని, ఒకవేళ ఏదైనా సమస్య స్థానికంగా పరిష్కరించే అవకాశం లేనప్పుడు జిల్లా అధికారులకు దృష్టికి తేవాలన్నారు. ప్రతి ఒక్కరూ పారదర్శకంగా పని చేస్తూ, ప్రజలకు జవాబుదారిగా విధులు నిర్వర్తిస్తే సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయని, ప్రజలకు ఇబ్బందులను దూరం చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన విధిగా గుర్తించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నచిన్న సమస్యలు క్షేత్ర స్థాయిలోనే పరిష్కరింపబడాలని, దీనివల్ల ఫిర్యాదుదారులు ఎంతగానో ఊరట చెందుతారని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతిచోట పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సందర్భంగా గతేడాదితో పోలిస్తే నిజామాబాద్ నగరానికి ఈసారి మంచి ర్యాంకు వచ్చిందని, ప్రస్తుతం ఈ నెల 31వ తేదీ వరకు సర్వే కొనసాగుతున్నందున స్వచ్ఛతా ర్యాంకు మరింతగా మెరుగుపర్చేందుకు అవకాశం ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో సానిటేషన్ పనులు జరిపించాలని ఆయన బల్దియా అధికారులకు సూచించారు. కలిసికట్టుగా కృషి చేస్తే పారిశుద్ధ్యం విషయంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపవచ్చని, ఈ దిశగా అధికారులు, సిబ్బంది అందరూ అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహనన పెంపొందిస్తూ, వారి ద్వారా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లోనూ అవగాహన తెచ్చేలా చర్యలు చేపట్టాలని డీఈఓ రాజేష్, ఉమ్మడి జిల్లాల ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్నలను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ఆయా కార్యక్రమాల నిర్వహణకు పురమాయించిన వెంటనే బాధ్యతలు నిర్వర్తించేందుకు కార్యాచరణతో ముందుకు సాగాలని, అనేక మంది మినిట్స్ వచ్చేంత వరకు వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారని, ఇది సమంజసం కాదన్నారు. కాగా, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ ఫ్లాగ్ కోడ్ పాటించేలా చూడాలని, ప్లాస్టిక్ జెండాలు వినియోగించరాదని సూచించారు. కోర్టు కేసుల విషయంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని, కేసు నమోదైన వెంటనే పూర్తి వివరాలతో కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని ఆదేశించారు. కోర్టు కేసుల అంశాలను సంబంధిత అధికారులు స్వయంగా తనను కలిసి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ.రవీందర్‌రెడ్డి, డీఆర్‌డీఓ కే.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డు పనులకు భూమిపూజ
ఆర్మూర్, జనవరి 22: పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టపై ఎక్కడం కోసం ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. ఘాట్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల 40 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఈ నిధులతో రోడ్డు పనులు చేపట్టడానికి పది మందితో ఒక కమిటీని ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఘాట్ రోడ్డును నిర్మించాలని, అవసరమైతే అదనపు నిధులను మంజూరు చేయిస్తానని చెప్పారు. వసంత పంచమిని పురస్కరించుకొని సిద్ధులగుట్ట గుట్టపై గల సిద్ధేశ్వరాలయం, రామాలయంలలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో అభిషేకం చేశారు. భక్తులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్, వైస్ చైర్మన్ లింగాగౌడ్, సిద్ధుల గుట్ట కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు రాజబాబు, రమాకాంత్, రమేష్, టీఆర్‌ఎస్ నాయకులు సంజయ్‌సింగ్ బబ్లూ, బోండ్ల సంతోష్, పింజ వినోద్, నయ్యూం, పీసీ గంగారెడ్డి, మధు, భారత్‌గ్యాస్ సుమన్, బొబిడే గంగాకిషన్ తదితరులు పాల్గొన్నారు.