నిజామాబాద్

‘కేసీఆర్ పేదల పక్షపాతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జనవరి 23: ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని, అనుక్షణం పేదల అభ్యున్నతి కోసమే ఆలోచనలు చేస్తారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా అన్నారు. మన ఇంటికి - మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన నగరంలోని ఆయా డివిజన్లలో పర్యటించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 22మందికి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. తన తరఫున కానుకగా చీర, షర్ట్, ప్యాంట్లను బహూకరించారు. ఆయా డివిజన్లలో నెలకొని ఉన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తున్న ఘనత తెరాసకే దక్కిందన్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో లేనప్పటికీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇదివరకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ప్రస్తుతం రెట్టింపు చేసే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. నిరుపేద కుటుంబాలకు యువతుల వివాహాలు భారంగా మారకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబంలో ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తేనే పురోగతి
*తెలంగాణ వర్శిటీ వీసీ సాంబయ్య
డిచ్‌పల్లి రూరల్, జనవరి 23: ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అంకితభావంతో పని చేసినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ సాంబయ్య అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో తెలంగాణ వర్శిటీ టేబుల్‌టాప్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీ.సీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమకంటూ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. అప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని ఉద్బోధించారు. సమయ పాలన అత్యంత కీలకమని అన్నారు.

సీసీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే పూజలు
బిచ్కుంద, జనవరి 23: మండలంలోని మాన్యపురం, రాజాపూర్, ఎల్లారం గ్రామాల్లో, మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పలు అభివృద్ది పనులకు ప్రారంభించారు. ఈసందర్భంగా పై గ్రామాల్లో సిసి రోడ్డు పనులకు పూజలు చేసి ప్రారంభించారు.అలాగే గ్రామాల్లో గ్రామసభల్లో పాల్గోని ఆయన మాట్లాడారు. రాష్ట్ర సీఏం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అమోఘంగా ఉన్నాయన్నారు. గతంలోఫించన్‌లు లబ్దిదారులకు అందకుండా దళారులు దోచుకునే వారని, నేడు సిఏం కేసీఆర్ ప్రభుత్వం బయోమెట్రిక్ ద్వారా నిజమైన లబ్దిదారునికే ఫించన్ అందే విధంగా చర్యలుతీసుకుంటుందన్నారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకోసం కళ్యాణ లక్ష్మి, షాధీ ముబారక్ తదితర పథకాలను అమలు చేసి ఆడపడుచులకు అన్నయ్యలా ఆదుకుంటున్న ప్రభుత్వం అని అన్నారు.