నిజామాబాద్

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, జనవరి 23: నగరంలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మిషన్ భగీరథ పథకంలో భాగంగా చేపడుతున్న పనుల్లో వేగం పెంచి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, నగర మేయర్ ఆకుల సుజాత, మున్సిపల్, రోడ్లు, భవనాల శాఖ, పబ్లిక్‌హెల్త్, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో మరింత వేగం పెంచాలని, ఎల్లమ్మగుట్ట, రఘునాథ ఆలయం వద్ద జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులు వారం, పక్షం రోజులకు ఒకసారి సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, పనుల పురోగతిపై సమీక్షించుకోవాలన్నారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టే సమయంలో గతంలో వేసిన రక్షిత మంచినీటి కోసం వేసిన పైప్‌లైన్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ పనుల వల్ల ప్రజలకు ఎక్కువగా ఏ ప్రదేశంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయో ఆ ప్రదేశాలను గుర్తించి, ఎక్కువ మొత్తంలో కార్మికులను నియమించి రాత్రి సమయంలోనూ పనులు జరిపించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం పనులు పూర్తయిన ప్రాంతాల్లో తిరిగి తవ్వకాలు జరుపుతుండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భగీరథ పనులు జరుగుతున్న ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్‌ఇ మధుసుదన్‌రెడ్డి, ఇఇ హన్మంత్‌రావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమేష్, నగర పాలక సంస్థ కమిషనర్ సాంసన్, మున్సిపల్ డిప్యూటీ ఇఇ రషీద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని దొడ్డికొమురయ్యనగర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేసి, పనులను సకాలంలో పూర్తి చేయించాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. అదే విధంగా డీబీకే పనులు పూర్తయ్యే లోపు ఆ ప్రాంతంలో తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర వౌలిక సదుపాయాలను కల్పన కోసం నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని పబ్లిక్‌హెల్త్ ఇఇ తిరుపతికుమార్‌ను ఆదేశించారు. నగరంలోని రఘునాథ ఆలయం వద్ద అమృత్ పథకం కింద చేపడుతున్న తాగునీటి పథకాల పైప్‌లైన్ పనులను కలెక్టర్ పరిశీలించారు. బోధన్ రోడ్డులో అమృత్ పథకం కింద పనులు జరుగుతుండగా, మధ్యమధ్యలో తవ్వకం పనులు ఎవరు జరుపుతున్నారని ఆర్ అండ్ బి ఎస్‌ఇ మధుసుదన్‌రెడ్డిని ప్రశ్నించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సమన్వయంతో సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు.