నిజామాబాద్

కులవృత్తులకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివనగర్, జనవరి 23 : తెలంగాణ రాష్ట్రంలోని కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రభుత్వ సబ్సిడీ గొర్రెల, మేకల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. 44వ జాతీయ రహాదారి నుండి బీరప్ప ఆలయం వరకు డోలు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని 54 మందికి సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పధకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుర్మ, యాదవులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారని, వారి దీవెనలు ముఖ్యమంత్రికి ఎప్పటికి ఉంటాయన్నారు. త్వరలోనే కాళేశ్వరం నీళ్లు వస్తాయని, అమర్లబండ, ముద్దోజివాడి గ్రామాల వద్ద 4 టిఎంసీల డ్యాం నిర్మాణంతో మండలంలోని 34 వేల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. ఫారెస్టు భూములలో గొర్రెలను, మేకలను మేపమటానికి ముఖ్యమంత్రి అనుమతిని ఇచ్చాడని తెలిపారు. ఉద్యోగం కల్గిన కుర్మలకు కూడా సబ్సిడీ గొర్రెలను అందిస్తామన్నారు. గ్రామంలోని మిగతా 76 మందికి కూడా సబ్సిడీ గొర్రెలను అందిస్తామని, షెడ్డు నిర్మాణాలకు కృషి చేస్తామన్నారు. కుర్మ కమ్యూనిటీ హాలు నిర్మాణం మంజూర్ చేస్తామని తెలిపారు. అనంతరం కుర్మ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి బంజ విజయశివకుమార్, జడ్పిటిసీ రాజేశ్వర్‌రావు, సిడిసి చైర్మన్ లింగారెడ్డి, విడిసీ చైర్మన్ పాపనోళ్ల బీరయ్య, గొర్రెల, మేకల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు మర్కంటి భూమన్న, రాష్ట్ర కార్యదర్శి బోంబాయి మల్లయ్య, సర్పంచ్ గంగమణిరాజన్న, టిఆర్‌ఎస్ నాయకుడు మర్కంటి బుచ్చన్న, ఎంపిటిసి లక్ష్మీ, ఎఎంసీ చైర్మన్ శ్యాంరావు, గ్రామ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, కుర్మ సంఘం సభ్యులు మల్లయ్య, నర్సయ్య, ఎల్లయ్య, గణేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ఏసీబీ అధికారులతో హడల్
*దాడులతో అవినీతిపరుల గుండెల్లో గుబులు

ఆర్మూర్, జనవరి 23: ఆర్మూర్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో అవినీతి అధికారులు హడలిపోతున్నారు. ఆర్మూర్ ప్రాంతంలో పని చేస్తున్న అధికారులు తాము చేసే పనులలో జాప్యం చేస్తూ ఆమ్యామ్యాల కోసం వేధింపులకు గురి చేస్తుండడంతో బాధితులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించి అవినీతిపరులైన అధికారులను పట్టిస్తున్నారు. కొందరు అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తూ పారదర్శకంగా పనులు చేస్తున్నారు. మరోవైపు కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ అక్రమ ధనార్జనను కొనసాగిస్తున్నారు. చిన్న పనులకు సైతం ప్రభుత్వ కార్యాలయాలలో రోజుల తరబడి తింపుకోవడంతో బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు. వేల రూపాయల వేతనాలు, అలవెన్సులు, సౌకర్యాలు పొందుతూనే ఆమ్యామ్యాలు ఇస్తేనే పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలుతమ పనుల కోసం కర్యాలయాల చుట్టు తిరిగి వెసిగి వేసారిపోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతూనే అవినీతికి ఊతమిస్తున్న అధికారులు ఈ మధ్య ఆర్మూర్‌లో నాలుగు రోజుల వ్యవధిలో ఏసీబీ అధికారులు రెండు సార్లు మముఖ్యమైన అధికారులపై దాడులు చేయడంతో బెంబెలిత్తిపోతున్నారు. అక్రమలకు పాల్పడుతున్న అధికారులు ఏసీబీ అధికారుల దాడులతో భయాందోళనకు గురవుతున్నారు. ఆర్మూర్ ఆర్‌డీఓ బాలే శ్రీనివాస్ మంజీర వాటర్ ప్లాంట్ యజమాని బదాం రాజ్‌కుమార్ వద్ద నుంచి 40 వేలు తీసుకుండడగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నెల 20న బాన్సువాడలోనీ నీటి పారుదల శాఖ డీఇ శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆదాయానికి మించి ఆస్థులు ఉన్నాయనే సమాచారంతో ఆర్మూర్‌లోని ఆయన తండ్రి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో పాటు ఆదాయానికి మించిన ఆస్థులు ఉన్నాయని సోదాలు చేసిన సంఘటనతో అధికారులతో గుబులు రేపుతుంది. అక్రమ ఆదాయంతో ఆదాయానికి మించి ఆస్థులు కూడబెట్టిన అధికారులతో పాటు ఆమ్యామ్యాలు తీసుకునే అధికారులు ఏ రోజు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
గతంలో ఏసీబీ పట్టుబడ్డ అధికారులు
ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలో పనుల కోసం కార్యాలయాలకు వచ్చిన బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేసి పట్టుబడడంతో పాటు ఆదాయానికి మించి ఆస్థులు ఉన్నాయనే సమాచారంతో ఏసీబీ అధికారుల దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఆర్మూర్ మండలం దేగాం సర్కిల్ విద్యుత్ ఏఈగా ఉన్న గురువయ్య రైతు వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆర్మూర్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఇన్‌చార్జీ సీఐ భాస్కర్‌గౌడ్, కానిస్టేబుల్ శివకుమార్‌లు కల్లు ముస్తేదారుల నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్మూర్ మండల రెవిన్యూ కార్యాలయంలో సర్వేయర్‌గా పని చేసిన నరేందర్ వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడకు చెందిన మాజీ మిలిటెంట్‌కు వ్యవసాయ స్థలాన్ని చూయించడానికి 50 వేలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్మూర్‌లో వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శివచరణ్‌రెడ్డికి ఆదాయానికి మించి ఆస్థులు ఉన్నాయని ఏసీబీ అధికారులు ఇంటిపై, పెర్కిట్‌లోని ఎంవీఐ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 2013లో ఆర్మూర్ మున్సిపల్ కమీషనర్‌గా ఉన్న మామిండ్ల నరేందర్ కాంట్రాక్టు పనులు చేసిన ముస్లీం మహిళకు బిల్లు చెల్లించే విషయంలో ఆర్మూర్‌లోని విద్యానగర్‌కాలనీలోని ఇంట్లో డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 2015లో దేగాం విద్యుత్ ఏఈ గోవర్ధన్ ఆలూర్ రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు విషయంలో 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ నెల 20న ఆర్మూర్‌కు చెందిన కాట్‌పల్లి శ్రావణ్‌కుమార్‌రెడ్డి బాన్సువాడలోని నీటి పారుదల శాఖలో డీఈగా విధులు నిర్వహిస్తూ ఆదాయానికి మించి ఆస్థులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆర్మూర్‌లోని అతని తండ్రి రఘుపతిరెడ్డి స్వగృహంలో సోదాలు చేశారు. ఈ సోదాలు మరిచిపోక ముందే డివిజన్ స్థాయిలో ఉన్న ఆర్‌డీఓ బాలే శ్రీనివాస్ వాటర్ ప్లాంట్ యజమాని బదాం రాజ్‌కుమార్ వద్ద నుంచి 40 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డాడు. వరుస దాడులతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
బాల్కొండ, జనవరి 23: మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేటు ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి విఫలయత్నం చేశారు. గుర్తు తెలియని దుండగులు ఏటీఎం గది అద్దాలు ధ్వంసం చేసి, లోపల ఉన్న ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేశారు. డబ్బులు ఉన్న మిషన్ తెరుచుకోకపోవడంతో దుండగులు తమ ప్రయత్నాన్ని విరమించుకుని వెళ్లిపోయారు. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఏసీపీ శివకుమార్, రూరల్ సీఐ రమణారెడ్డి, మెండోరా ఎస్‌ఐ రాఘవేందర్ తదితరులు పరిశీలించి, చోరీ జరిగిన వివరాలు తెలుసుకున్నారు. ఏటీఎంలో డబ్బులు జమ చేసే ఏజెన్సీ వ్యక్తులతో పాటు క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించాలని ఏసీపీ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.