వరంగల్

పాకాల నీటితో ‘మానుకోట’ గొంతు తడుపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఏప్రిల్ 19: మానుకోట పట్టణ ప్రజల దాహార్తిని పాకాల నీటితో తీరుస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. మానుకోట ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మానుకోట తాగునీటి పరిస్థితిపై స్థానకి మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. అధికారుల అంచనా ప్రకారం ప్రస్తుతం చెక్‌డ్యాం వద్ద ఉన్న నీరు మరో 10 నుండి 15 రోజుల పాటు సరిపోతుందని తెలిపారన్నారు. ఈలోగా నర్సంపేట ప్రాంతంలోని పాకాల చెరువు కింద వేసిన పంటలు కూడా రైతుల చేతికి వస్తాయని, అప్పుడు పాకాల నీటిని మునే్నరుకు తీసుకురావడం తేలికవుతుందని శ్రీహరి చెప్పారు. పాకాల నీటితో మునే్నరు నింపినట్లయితే వేసవి సమస్య లేకుండా పట్టణ ప్రజలు తాగునీటిని అందుకోగలుగుతారని అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి మునే్నరుపై అదనపు చెక్‌డ్యాం అంశాన్ని గతంలో తీసుకెళ్లడం జరిగిందని, మరోసారి చర్చించి అదనపు చెక్‌డ్యాం నిర్మాణంపై ప్రకటన చేస్తామని అన్నారు. మానుకోటలో కూల్చివేతకు గురైన అంబేద్కర్ భవన అంశం కూడా వివాదాస్పదంగా ఉందని, త్వరలోనే అన్ని వర్గాలతో మాట్లాడి అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకుని రూ. 30 నుండి రూ. 40లక్షలు ఖర్చయనా.. వెనుకాడకుండా ఒక మంచి భవనాన్ని సౌకర్యవంతంగా నిర్మిస్తామని, ఈ అంశాన్ని ఎవ్వరూ రాజకీయం చేయవద్దని శ్రీహరి తెలిపారు. మానుకోటలో వచ్చే విద్యాసంవత్సరం నుండి బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రారంభిస్తామని ప్రకటించారు. మానుకోటలో నిర్మించిన ఆర్‌యూబి మూలంగా లాభం కంటే ప్రజలకు నష్టమే ఎక్కువగా జరిగిందని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పలుమార్లు తన దృష్టికి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దృష్టికి తీసుకువచ్చారని, ఈ అంశంపై ఉన్నతాధికారుల చేత విచారణ కూడా చేయించడం జరిగిందన్నారు. నివేదికను పరిశీలించి మానుకోట ప్రజలకు లాభం జరిగే విధంగా ఆర్‌యూబిలో స్వల్ప మార్పులు చేస్తామని శ్రీహరి తెలిపారు.