నిజామాబాద్

హరితహారం మొక్కలకు స్థల సమస్య తప్పదా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు స్థలాల పరిశీలనలో నిమగ్నమవుతున్నారు. గత సంవత్సరం హరితహారం పథకంలో గ్రామానికి 40వేల మొక్కల వంతున మోర్తాడ్ ఉమ్మడి మండలంలో దాదాపు 4లక్షల మొక్కలు నాటారు. అంతకుముందు రెండవ విడతలోనూ ఇంచుమించు ఇంతే మొత్తంలో మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించుకుని పూర్తి చేశారు. శ్రీరాంసాగర్ వరద కాల్వ కట్టలపైనే కాకుండా గ్రామాల్లోని రోడ్లు, జాతీయ రహదారులకు ఇరువైపులా పెద్ద మొత్తంలో మొక్కలు నాటారు. చెరువు శిఖం భూములను కూడా వదలకుండా మొక్కలను నాటించారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాల్లోనూ, పాఠశాలల్లోనూ మొక్కలు నాటి వాటి సంరక్షణపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. నాటిన మొక్కలన్నీ పెరుగుతున్న మొక్కలేనంటూ ఎప్పటికప్పుడు నివేదికలను సిద్ధం చేస్తూ, జిల్లా యంత్రాంగానికి పంపుతున్నారు. దాదాపు 70శాతం మేర మొక్కలు పెరుగుతున్నట్లుగా నివేదికల్లో పేర్కొన్నారు. ప్రధానంగా గతేడాది జాతీయ రహదారికి ఇరువైపులా, పంట పొలాల్లో నాటిన మొక్కలన్నీ నాలుగు అడుగుల మేర పెరిగాయి. రైతుల పంట పొలాల్లోనే వీటిని నాటడంతో సమృద్ధిగా నీటితో పాటు ఎరువులు అందడంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఈసారి కూడా మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో 4లక్షల వరకు మొక్కలు నాటాలని హరితహారంలో లక్ష్యంగా నిర్ణయించుకుని, నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. మండలాల పునర్విభజన ప్రక్రియతో మోర్తాడ్ రెండు మండలాలుగా విడిపోయి నూతనంగా ఏర్గట్ల మండలంగా ఉనికిలోకి వచ్చింది. దీంతో పై రెండు మండలాలకు వేర్వేరుగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని కార్యాచరణకు అనుగుణంగా మొక్కలు నాటాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటిన ప్రదేశాలు మినహాయించుకుని, కొత్త ప్రదేశాలను ఎంపిక చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. ఉమ్మడి మండలంలోని అంతర్ గ్రామాల రోడ్లకు ఇరువైపులా ఇప్పటికే స్థలాలు గుర్తించిన అధికారులు, గ్రామాల్లో దళితులకు చెందిన అసైన్‌మెంట్ భూముల్లో పండ్ల మొక్కలు నాటాలని యోచిస్తున్నారు. నిజానికి గతేడాది అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నర్సరీల్లో యాభై శాతానికి పైగా పండ్ల మొక్కలు నాటారు. వీటితో పాటుగా మండల కార్యాలయం ఆవరణలోనూ, డిగ్రీ కళాశాల ఆవరణలోనూ అధిక సంఖ్యలో మొక్కలు నాటారు. దీంతో ప్రస్తుతం గతేడాది స్థాయిలోనే కేటాయిస్తున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఖాళీ స్థలాలను ఎంపిక చేయడం అధికారులకు ఒకింత ఇబ్బందిగా పరిణమిస్తోందని తెలుస్తోంది. అయితే మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకోకుండా నాటిన ప్రతి మొక్కకు నీరందేలా చూడాల్సిన అవకాశాలను గుర్తిస్తూ, ఆయా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈత వనాల పెంపుదలపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. రెండు విడతల్లోనూ నాటిన ఈత మొక్కలు వనాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అయితే గత సంవత్సరం నాటిన ఈత మొక్కలకు సకాలంలో నీరందకపోవడంతో పూర్తిస్థాయిలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఈసారి అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా పకడ్బందీ ప్రణాళికతో స్థలాలను గుర్తించి, నాటిన ప్రతి ఈత మొక్కను పెరిగేలా చూస్తామని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతాల్లో ఈత వనాలు తగ్గిపోయినందున తమకు అసైన్‌మెంట్ భూములు కేటాయిస్తే ఈత వనాలు పెంచుకుంటామని గీత కార్మికులు సైతం కోరుతున్నారు. హరితహారం మొక్కల కోసం స్థలాలను గుర్తించాలని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారుల నుండి వౌఖిక ఆదేశాలు అందుకున్న అధికారులు, ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.