నిజామాబాద్

రెవెన్యూ, వ్యవసాయ అధికారులపై జేసీ మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, ఫిబ్రవరి 23: బాల్కొండ మండలం కిసాన్‌నగర్ గ్రామంలో కొనసాగుతున్న ఎర్రజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఏ.రవీందర్‌రెడ్డి సందర్శించారు. అక్కడి అస్తవ్యస్త పరిస్థితులను గమనించి రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులపై ఆగ్రహం ప్రదర్శించారు. బోదేపల్లి వీఆర్‌ఓ రామకృష్ణ, వనె్నల్(బీ) వీఆర్‌ఓ బాలగంగాధర్‌తో పాటు ఏఈఓ నిహారికలు పంట సేకరణకు సంబంధించి అందించిన వివరాలకు, రైతులు కేంద్రానికి తెచ్చిన పంట నిల్వలకు పొంతన లేకపోవడాన్ని గమనించి వారిపై మండిపడ్డారు. పై ముగ్గురిని సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను తొలుత ఆదేశించిన జే.సీ, అనంతరం షోకాజ్ నోటీసులు అందించాలని సూచించారు. పంట నూర్పిడి యంత్రాలు సరిపోవడం లేదని రైతులు జే.సీ దృష్టికి తేగా, రెండు యంత్రాలను అదనంగా తెప్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఎర్రజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినందున రైతులు ఈ కేంద్రాలకే పంటను తెచ్చి విక్రయించుకోవాలని జే.సీ సూచించారు. జే.సీ వెంట తహశీల్దార్ రాజేందర్, మండల వ్యవసాయ అధికారి మహేందర్‌రెడ్డి, ఆర్‌ఐ హరీశ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సాగర్, మార్క్‌ఫెడ్ అధికారులు, రైతులు ఉన్నారు.
బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
బాల్కొండ, ఫిబ్రవరి 23: ఇటీవల కురిసిన వడగళ్ల వాన వల్ల పంటలు కోల్పోయిన బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి డిమాండ్ చేశారు. ముప్కాల్ మండలంలో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నష్టం వాటిల్లిన పంటల వివరాలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే తప్పుల తడకగా ఉందని, అధికారులు సరైన రీతిలో సర్వే జరపడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు రఘు, మాజిద్, క్రాంతి, భీమ్‌గల్ మండల అధ్యక్షుడు నాగార్జున్‌రెడ్డి, స్వామి, శేఖర్ ఉన్నారు.
ఎర్రజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
బాల్కొండ, ఫిబ్రవరి 23: ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో ఎర్రజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక రైతులు శుక్రవారం తహశీల్దార్ విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. బాల్కొండ ఉమ్మడి మండలంలోని రైతులు ఎక్కువగా ఎర్రజొన్న పంట సాగు చేస్తామని, ఇందులో రెంజర్ల, వెంచిర్యాల్, నాగంపేట్, నల్లూర్ గ్రామాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంట సాగయ్యిందని అన్నారు. పై గ్రామాలకు రెంజర్ల కేంద్ర బిందువుగా ఉంటుందని, తమ సౌలభ్యం కోసం ఇక్కడ ఎర్రజొన్న కొనుగోలు కేంద్రం నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం సమర్పించిన రైతుల్లో లింబాద్రి, చిన్నారెడ్డి, నర్సయ్య, రవి తదితరులు ఉన్నారు.
తె.యూలో 27న పార్ట్‌టైం లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూ
డిచ్‌పల్లి రూరల్, ఫిబ్రవరి 23: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగంలో పార్ట్‌టైం లెక్చరర్ పోస్టు కోసం ఈ నెల 27వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని ఆ విభాగాధిపతి డాక్టర్ శిరీష బోయపాటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ బిల్డింగ్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని అన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఆంగ్లంలో ఎం.ఏ పూర్తి చేసి ఉండాలని, నెట్, సెట్, డాక్టరేట్‌ను సాధించినట్లయితే ఎంపికయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సకాలంలో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.
తాగునీటి సమస్యపై డీపీఓ సమీక్ష
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23: దర్పల్లి మండలంలో మంచినీటి సమస్యపై సచివాలయ కార్యదర్శులతో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సమస్య తలెత్తకముందే, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని డీపీఓ ఆదేశించారు.